
Bengaluru: సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి చెందిన నగరం బెంగుళూర్. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది పారిశ్రామిక వేత్తలను, పెట్టుబడిదారులను తన వైపు ఆకర్షిస్తున్నది. అయితే.. ఈ క్రమంలో పెరిగిపోతున్న జనాభా వల్ల ట్రాఫిక్ కష్టాలు కూడా అదే రీతిలో పెరుగుతున్నాయి. ఆ ట్రాఫిక్ కష్టాలను ఎదుర్కొవడంలో ఐటీ రాజధాని అపఖ్యాతి పాలవుతోంది. ఇక నుంచి ఆ ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టాలని, ట్రాఫిక్ జంక్షన్లలో వేచి ఉండే సమయాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారు బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు. మేరకు గూగుల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. గూగుల్ సాయంతో ట్రాఫిక్ కష్టాలు తీర్చాలని భావిస్తున్నారు.
అదేలా సాధ్యమవుతుందంటారా..?
బెంగుళూర్ లో క్రమంగా పెరుగుతోన్న వాహనాలు, వాటివల్ల వచ్చే ట్రాఫిక్ సమస్యలు ఆ సీటీ ట్రాఫిక్ పోలీసులకు తలనొప్పిగా మారింది. ఈ ట్రాఫిక్ సమస్యలను నియంత్రించేందుకు సాంకేతిక దిగ్గజం గూగుల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు బెంగళూరు పోలీసులు. ఇక ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు బెంగళూరు పోలీసులు గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించనున్నారు. గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా.. నగరంలోని ప్రధాన కూడళ్ల ట్రాఫిక్ సిగ్నల్స్ నిర్వహించబడతాయి. బెంగళూరు పోలీసులు తాజాగా గూగుల్‌తో ఈ పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు.
గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ట్రాఫిక్ నియంత్రించే తొలి నగరంగా బెంగళూరు నిలిచిందని బెంగళూర్ సీటీ పోలీస్ కమిషనర్ ప్రతాప్ రెడ్డి అన్నారు. సీటీలో ట్రాఫిక్‌ను నియంత్రించి, ఇబ్బందులు తగ్గించడానికి గూగుల్‌తో అనుసంధానం కావడం చాలా గర్వంగా ఉందనీ, ఇలా చేయడం వల్ల లక్షల మంది నగరవాసుల జీవనంపై సానుకూల ప్రభావం చూపిస్తుందని అన్నారు.
ఇటీవలే ట్రాఫిక్ లైట్స్‌ను గూగుల్‌తో ఆప్టిమైజ్ చేసే పైలెట్ ప్రాజెక్టును ప్రారంభించామనీ, ఇలా చేయడం వల్ల సిగ్నల్స్ వద్ద వెయిటింగ్ టైం చాలా తగ్గిందనీ, సీటీలో ఎదురయ్యే ట్రాఫిక్ కష్టాలకు గూగుల్ నుంచి ఇన్‌పుట్స్ తీసుకుంటామనీ, గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో నగరంలో ట్రాఫిక్ ను సులభంగా అంచనా వేయగలమనీ, ఇప్పటికే గూగుల్ ఇచ్చిన డేటా ప్రకారం.. ఇప్పటికే సుమారు 20శాతం వెయిటింగ్ టైమ్ తగ్గిందనీ, కేవలం వెయింటింగ్ చేసే టైం మాత్రమే కాకుండా.. వాహనాల ఇంధనం కూడా చాలా ఆదా అవుతోందని, నగరంలో ట్రాఫిక్ జామ్‌లను నియంత్రించడానికి గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా ఉపయోగపడుతోందని అన్నారు.
బెంగళూరులో కోటికిపైగా వాహనాలు ఉన్నాయనీ, త్వరలోనే అన్ని సిగ్నల్స్‌ను గూగుల్‌తో ఆప్టిమైజ్ చేస్తామని సిటీ కమిషనర్ తెలిపారు. అలాగే.. గూగుల్ మ్యాప్స్‌లో స్పీడ్ లిమిట్స్‌ను ఏర్పాటు చేస్తామని, నిర్థిష్ట వేగాన్ని దాటితే.. దానిని ఓవర్ స్పీడ్ గా పరిగణిస్తామని అన్నారు.