DHFL bank fraud case: ఐదున్నర కోట్ల పెయింటింగ్స్.. 2 కోట్లు విలువ చేసే వాచీలు.. విలువైన నగలు, వజ్రాభరణాలు  

Published : Jul 28, 2022, 06:56 PM IST
DHFL bank fraud case: ఐదున్నర కోట్ల పెయింటింగ్స్.. 2 కోట్లు విలువ చేసే వాచీలు.. విలువైన నగలు, వజ్రాభరణాలు  

సారాంశం

DHFL bank fraud case: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిర్యాదు మేరకు సీబీఐ జూన్ 20న DHFL bank పై  కేసు నమోదు చేసింది. ఈ కేసు వివరాల్ని పరిశీలిస్తే 2010-2018 వరకు ఎనిమిదేళ్ల కాలంలో యూనియన్ బ్యాంకు కన్సార్టియం నుంచి డిహెచ్‌ఎఫ్‌ఎల్‌కు  దాదాపు రూ.42,871 కోట్ల రుణాన్ని అందించింది.

DHFL bank fraud case: బ్యాంకులను రూ.34,615 కోట్ల మేర మోసం చేసిన కేసులో దివాన్ హౌజింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (DHFL) మాజీ ప్రమోటర్లపై CBI కేసులు నమోదు చేసింది. Union Bank of India ఆధ్వర్యంలోని 17 బ్యాంకుల కన్సార్టియంలను మోసం చేశారన్న ఆరోపణలతో ఇప్ప‌టికే DHFLప్రమోటర్లు ధీరజ్ వదవాన్, కపిల్ వదవాన్  తదితరులపై కేసులు నమోదు చేసిన విష‌యం తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరూ సీబీఐ కస్టడీలో ఉన్నారు. తాజాగా ఈ DHFL బ్యాంక్ మోసం కేసులో సీబీఐ గురువారం పలు చోట్ల దాడులు నిర్వహించింది. ఈ దాడిలో పెయింటింగ్స్, వాచీలు, బంగారం, వజ్రాభరణాలు సహా రూ.12.50 కోట్ల విలువైన కొన్ని విలువైన వస్తువులు CBI స్వాధీనం చేసుకుంది.

ఈ దాడుల్లో  FN సౌజా (1964), SH రజా (1956) పెయింటింగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.  ఈ పెయింటింగ్స్  విలువ సుమారు రూ. 5.50 కోట్లు. అదే స‌మ‌యంలో రూ. 5 కోట్ల విలువైన జాకబ్ & కో, ఫ్రాంక్ ముల్లర్ జెనీవ్‌కు చెందిన రెండు వాచీలను కూడా సీబీఐ స్వాధీనం చేసుకుంది. వీటి విలువ సుమారు రూ. 2 కోట్ల ఉన్న‌ట్లు అంచ‌నా.  విలువైన గాజులు, నెక్లెస్‌తో సహా రూ.2 కోట్ల విలువైన బంగారు, వజ్రాభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు సీబీఐ త‌న‌ ప్రకటనలో తెలిపింది. 

Union Bank of India ఆరోపణ‌లు

17 బ్యాంక్ కన్సార్టియం గ్రూపునకు నాయకత్వం వహిస్తున్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిర్యాదు మేరకు సీబీఐ జూన్ 20న ఈ కేసులో కేసు నమోదు చేసింది. ఈ కేసు వివరాల్ని పరిశీలిస్తే 2010-2018 వరకు ఎనిమిదేళ్ల కాలంలో యూనియన్ బ్యాంకు కన్సార్టియం నుంచి డిహెచ్‌ఎఫ్‌ఎల్‌కు  దాదాపు రూ.42,871 కోట్ల రుణాన్ని అందించింది. మే 2019 నుండి రుణాన్ని తిరిగి చెల్లించకుండా కపిల్, ధీరజ్ వాధావన్ గ్రూపును రూ.34,615 కోట్ల మేర మోసగించారని బ్యాంక్ ఆరోపించింది. వాధావాన్ సోదరులు  వాస్తవాలను తప్పుగా చిత్రీకరించారని, నేరపూరిత, చ‌ట్ట‌ ఉల్లంఘనకు పాల్పడ్డారని Union Bank of India పేర్కొంది. 

మే 2019 నుండి రుణ చెల్లింపులో డిఫాల్ట్ చేయడం ద్వారా రూ. 34,615 కోట్లకు మోసపూరితంగా ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసింది. డీహెచ్‌ఎఫ్‌ఎల్ ఖాతా పుస్తకాల పరిశీలనలో కంపెనీ ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు తేలింది. డబ్బు దుర్వినియోగం. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించిన‌ట్టు గుర్తించారు.

రమేష్ నవందర్ అరెస్టు

ఇంతకు ముందు ఈ కేసులో జూలై 13న ముంబైకి చెందిన వ్యాపారవేత్త అజయ్ రమేష్ నవందార్‌ను సీబీఐ అరెస్టు చేసింది. గతవారం నవాందార్‌ ప్రాంగణంలో సీబీఐ సోదాలు నిర్వహించి, కోటి రూపాయల విలువైన పలు లగ్జరీ వాచ్‌లను స్వాధీనం చేసుకున్నామని, అందులో రోలెక్స్ ఆయిస్టర్ పర్పెచువల్, కార్టియర్, ఒమేగా, హుబ్లాట్ ఎం. కోర్స్‌లు ఉన్నాయని అధికారులు తెలిపారు. దీంతో పాటు రూ.33 కోట్ల విలువైన రెండు పెయింటింగ్స్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ విలువైన వస్తువులు డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ మాజీ సీఎండీ కపిల్‌ వాధావన్‌, కంపెనీ మాజీ డైరెక్టర్‌ ధీరజ్‌ వాధావన్‌లకు చెందినవని, బ్యాంకులను రూ.34,615 కోట్ల మేర మోసగించినట్లు అధికారులు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?