లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేతగా అధీర్ రంజన్ చౌదరి

By narsimha lodeFirst Published Jun 18, 2019, 5:40 PM IST
Highlights

లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ పక్ష నేతగా  అధీర్ రంజన్ చౌదరి వ్యవహరించనున్నారు. మంగళవారం నాడు సోనియాగాంధీ నేతృత్వంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ  పార్లమెంటరీ పక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకొన్నారు.
 

న్యూఢిల్లీ:  లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ పక్ష నేతగా  అధీర్ రంజన్ చౌదరి వ్యవహరించనున్నారు. మంగళవారం నాడు సోనియాగాంధీ నేతృత్వంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ  పార్లమెంటరీ పక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకొన్నారు.

బెంగాల్ రాష్ట్రం నుండి  ఐదు దఫాలు అధీర్ చౌదరి ఎంపీగా ఎన్నికయ్యారు. గతంలో బెంగాల్ పీసీసీ చీఫ్ గా కూడ ఆయన పనిచేశారు.  యూపీఏ 2 లో అధీర్ చౌదరి కేంద్ర మంత్రిగా పనిచేశారు. 

గత లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేతగా  వ్యవహరించిన మల్లికార్జున ఖర్గే  ఈ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. రాహుల్ గాంధీ లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేతగా బాధ్యతలు స్వీకరించేందుకు సుముఖంగా లేరు.  దీంతో లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ పక్ష నేతగా అధీర్ రంజన్ ను ఎన్నుకొన్నారు.  


 

click me!
Last Updated Jun 18, 2019, 5:40 PM IST
click me!