ప్రధాని మోడీకి మమతా బెనర్జీ కృతజ్ఞతలు.. కేంద్రానికి సహకరిస్తానన్న దీదీ

Siva Kodati |  
Published : May 05, 2021, 09:40 PM IST
ప్రధాని మోడీకి మమతా బెనర్జీ కృతజ్ఞతలు.. కేంద్రానికి సహకరిస్తానన్న దీదీ

సారాంశం

ప్రధాని నరేంద్ర మోడీకి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కృతజ్ఞతలు తెలిపారు. సీఎంగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా మోడీ తనకు శుభాకాంక్షలు చెప్పడంపై దీదీ స్పందించారు.

ప్రధాని నరేంద్ర మోడీకి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కృతజ్ఞతలు తెలిపారు. సీఎంగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా మోడీ తనకు శుభాకాంక్షలు చెప్పడంపై దీదీ స్పందించారు. బెంగాల్‌కు కేంద్రం నుంచి నిరంతర మద్దతు ఉండాలని మమత ఆకాంక్షించారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించడంతో మమతా బెనర్జీ ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో ప్రధాని ట్వీట్ చేశారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మమతా దీదీకి శుభాకాంక్షలు అని పేర్కొన్నారు.

Also Read:బస్సులు, లోకల్ రైళ్లు రద్దు.. కర్ఫ్యూ తరహా ఆంక్షలు: కరోనాపై దీదీ యాక్షన్

దీనిపై మమతా బెనర్జీ సమాధానమిస్తూ.. శుభాకాంక్షలు తెలిపినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే  బెంగాల్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం నుంచి నిరంతర సాయం లభిస్తుందని సీఎం ఆకాంక్షించారు. కేంద్రానికి తన పూర్తి సహకారం ఉంటుందని.. మహమ్మారి సహా ఇతర సవాళ్లను ఎదుర్కొనేందుకు కలిసికట్టుగా పోరాడాలనీ మమతా బెనర్జీ పిలుపునిచ్చారు.

 

 

PREV
click me!

Recommended Stories

Indigo కు షాక్: 10 శాతం విమానాలు రద్దు.. రంగంలోకి ప్రత్యేక టీమ్ తో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
ఏఐ ఉద్యోగాలను తగ్గించదు.. పెంచుతుంది : యోగి ఆసక్తికర కామెంట్స్