పశ్చిమ బెంగాల్ అడ్వకేట్ జనరల్ కిషోర్ దత్త రాజీనామా !

By AN TeluguFirst Published Sep 14, 2021, 4:58 PM IST
Highlights

అడ్వకేట్ జనరల్ గా 2017 ఫిబ్రవరిలో దత్త బాధ్యతలు తీసుకున్నారు. మమత ప్రభుత్వంలో ఈయన నాలుగవ అడ్వకేట్ జనరల్. మమతా బెనర్జీ నేతృత్వంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మొదటిసారి అధికారంలోకి వచ్చిన తరువాత తొలి అడ్వకేట్ జనరల్ గా అనింద్య మిత్ర బాధ్యతలు నిర్వర్తించారు.

కోల్ కతా : పశ్చిమ బెంగాల్ అడ్వొకేట్ జనరల్ కిషోర్ దత్త మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే తాను రాజీనామా చేసినట్లు ఆయన తెలిపారు. రాజీనామా లేఖను గవర్నర్ జగ్ దీప్ ధన్ కర్ కు పంపారు. ఆయన వెంటనే ఆమెదం తెలిపినట్లు రాజ్ భవన్ వర్గాలు తెలిపాయి. 

అడ్వకేట్ జనరల్ గా 2017 ఫిబ్రవరిలో దత్త బాధ్యతలు తీసుకున్నారు. మమత ప్రభుత్వంలో ఈయన నాలుగవ అడ్వకేట్ జనరల్. మమతా బెనర్జీ నేతృత్వంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మొదటిసారి అధికారంలోకి వచ్చిన తరువాత తొలి అడ్వకేట్ జనరల్ గా అనింద్య మిత్ర బాధ్యతలు నిర్వర్తించారు. 

ఆ తరువాత బిమాల్ ఛటర్జీ, జయంత మిత్ర కొనసాగారు. తాజాగా దత్త రాజీనామాతో మమత ప్రభుత్వంలో ఐదవ వ్యక్తిగా, ఏజీగా గోకుల్ ముఖర్జీకి  అవకాశం దక్కింది.
 
click me!