ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికల రేసులో తెలుగు తేజం.. జగన్ మోహన్ రావు ముందువరసలో..

By AN TeluguFirst Published Sep 14, 2021, 2:24 PM IST
Highlights

నేషనల్ హ్యాండ్‌ బాల్ జాతీయ సమావేశం ఇటీవల ల‌క్నోలో జరిగింది. దీనిలో సంఘం అధ్యక్షుడు అరిశనపల్లి జగన్మోహన్ రావు పాల్గొన్నారు. హ్యాండ్ బాల్ క్రీయాకారులకు ఇప్పటివరకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చామని, ఇక ముందు కూడా అలానే క్రీడాకారులకు తగిన ప్రోత్సహాం అందజేస్తామని ఆయన చెప్పారు.

దేశంలోని క్రీడా సంఘాలకు అరుదుగా తెలుగు వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు ఎక్కువగా ఉత్తరాది వారే దేశంలోని ప్రముఖ క్రీడా సంఘాలలో అజమాయిషీ చేస్తుండేవారు. కానీ ఇప్పుడు మన తెలుగు వారు కూడా దేశంలోని వివిధ క్రీడా సంఘాలపై పట్టు సాధిస్తున్నారు. 

నేషనల్ హ్యాండ్‌ బాల్ జాతీయ సమావేశం ఇటీవల ల‌క్నోలో జరిగింది. దీనిలో సంఘం అధ్యక్షుడు అరిశనపల్లి జగన్మోహన్ రావు పాల్గొన్నారు. హ్యాండ్ బాల్ క్రీడాకారులకు ఇప్పటివరకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చామని, ఇక ముందు కూడా అలానే క్రీడాకారులకు తగిన ప్రోత్సహాం అందజేస్తామని ఆయన చెప్పారు.

జాతీయ హ్యాండ్ బాల్ అసోసియేషన్ మెరుగు పడటానికి విశేష కృషి చేసిన జగన్మోహన్ రావు తాను అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఎన్నికయినప్పటి నుండి ఎందరో పేద క్రీడాకారులను వెలుగులోకి తీసుకొచ్చారు. అందుకే అనతికాలంలోనే జాతీయ స్థాయిలో అఖండ పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. 

సాధారణంగా ఒక దక్షిణాది ప్రాంతానికి చెందిన వ్యక్తిని అందులో తెలుగు వాణ్ని క్రీడా సంఘాలలో అత్యున్నత స్థాయిలో ఉంటున్నారంటే అది మామూలు విషయం కాదు. కానీ జగన్ మోహన్ రావు ఆ అవాంతరాలన్నిటిని దాటుకొని ఇప్పుడు జాతీయ క్రీడా సంఘాలలో తనదైన ముద్ర కనబర్చారు. 

అందుకే దేశంలోనే  హ్యాండ్ బాల్ అసోసియేషన్ కు అంతకుముందు లేని ఒక ప్రత్యేమైన గుర్తింపు వచ్చింది. ఈ విశేషమైన కృషి వల్లే ఇప్పుడు జగన్ మోహన్ రావు ఇండియన్ ఒలంపిక్ అసోసియేషన్ ఎన్నికల్లో ముందువరసలో ఉన్నారు. త్వరలో రాబోయే భారత ఒలంపిక్ సంఘం ఎన్నికల్లో జగన్ మోహన్ రావు అత్యున్నత స్థానానికి పోటీ పడబోతున్నారు.

click me!