
బెళగావి : కుందానగరి belagavi లో తీవ్ర సంచలనం రేకెత్తించిన
Real estate trader దొడ్డ బొమ్మన్నవర్ హత్య సంఘటన అనూహ్య మలుపు తిరిగింది. ఆయన రెండో భార్య, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇద్దరు భాగస్తులు murderకు పథకం రూపొందించారని, హంతకులకు రూ.పది లక్షల supari చెల్లించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడయ్యింది. ఈ నేపత్యంలో ఈ పథకాన్ని రూపొందించిన హతుడి రెండో భార్య కిరణ్, భాగస్తులు ధర్మేంద్ర, శశికాంత్ లను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 15న ఉదయం రాజు దొడ్డబొమ్మన్నవర్ హత్యకు గురైన విషయం గుర్తుండే ఉంటుంది. ఉదయం మోటార్ సైకిల్ మీద వచ్చిన దండుగులు ఆయన ముఖం మీద కారంపొడి చల్లి హత్య చేసి పరారయ్యారు.
రహదారి పక్కన పడి ఉన్న శవాన్ని వ్యాహ్యాళికి వచ్చిన కొందరు గుర్తించి పోలీసులకు సమాచారాన్ని అందించారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులకు విస్తుపోయే నిజాలు వెలుగులోనికి వచ్చాయి. రాజు దొడ్డబొమ్మన్నవర్ కు ముగ్గురు భార్యలు, వారికి వేర్వేరుగా ఇండ్లు కట్టించాడు. డబ్బు విషయంలో రెండో భార్య కిరణతో గొడవలొచ్చాయి. ఇదే అదనుగా వ్యాపారంలో భాగస్తులు ఆమెతో చేతులు కలిపారు. హంతుకులతో మాట్లాడి రూ. 10 లక్షల సుపారీ ఇచ్చారని పోలీసులు వివరించారు. అనుమానంతో భార్యను అదుపులోకి తీసుకోవడంతో హత్య సంఘటన దాదాపుగా ఒక కొలిక్కి వచ్చినట్లైందని పోలీసులు తెలిపారు.
కాగా, బెళగావిలో మంగళవారం తెల్లవారుజామున ఓ బిల్డర్ దారుణ murderకు గురయ్యాడు. పట్టణంలోని గురుప్రసాద్ నగరలో నివాసం ఉంటున్న bulder రాజు దొడ్డబణ్ణవర (46) హత్యకు గురయ్యాడు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భార్యను చూడటానికి ఆయన కారులో వెల్తుండగా దుండగులు కారును అడ్డగించి కారంపొడి చల్లి మారణాయుధాలతో నరికి పరారయ్యారు.
వివాహిత ఆత్మహత్య..
వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన చామరాజనగర జిల్లా కొళ్లేగాలలో జరిగింది. బాగలకోటకు చెంది విద్యాశ్రీ (22)ని మూడేళ్ల క్రితం బెళగావికి చెందిన ఆనంద్ కు ఇచ్చి వివాహం చేశారు. హనూరు తాలూకా హౌగ్యం గ్రామపంచాయతీ పీడీఓగా పనిచేస్తున్న ఆనంద్ కొళ్లేగాలలో నివాసం ఉంటున్నారు. విద్యాశ్రీని కట్నం కోసం వేధించటం వల్ల ఆత్మహత్య చేసుకున్నట్లు మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరికి తొమ్మిది నెలల చిన్నారి ఉంది. ఆనంద్ ను పోలీసులు విచారణ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, Tinder app ద్వారా పురుషులతో పరిచయం ఏర్పరచుకుని ప్రేమ పేరుతో దగ్గర కావడం ఆపై marriage చేసుకుని కొన్నాళ్లకు విడిపోవడమే పనిగా పెట్టుకుంది ఓ లేడి. మూడో భర్త ఆమె నిర్వాకాలపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళితే.. మైసూరులోని ఉదయగిరికి చెందిన నిధాఖాన్ గత రెండువేల పంతొమ్మిదిలో బెంగళూరులో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేసే ఆజమ్ఖాన్ తో పరిచయంపెంచుకుని పెళ్లి చేసుకుంది.
కొన్నిరోజులకే నిధా ఖాన్ ప్రవర్తన తేడాగా ఉండడంతో ఆజంఖాన్ ఆరా తీశాడు. ఆమె అప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకుని విడిపోయిందని గుర్తించాడు. ఆన్లైన్లో మరికొందరు పురుషులతో చాటింగ్ చేస్తోందని మైసూరులోని ఉదయగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరో వ్యక్తితో ఉండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నట్లు తెలిపాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.