స్కూల్ గర్ల్స్ స్ట్రీట్ ఫైటింగ్.. జుట్టు పట్టుకుని, కర్రలతో దాడి.. ఎందుకో తెలిస్తే ఖంగుతినాల్సిందే! (వీడియో)

Published : May 18, 2022, 06:06 PM ISTUpdated : May 18, 2022, 06:44 PM IST
స్కూల్ గర్ల్స్ స్ట్రీట్ ఫైటింగ్.. జుట్టు పట్టుకుని, కర్రలతో దాడి.. ఎందుకో తెలిస్తే ఖంగుతినాల్సిందే! (వీడియో)

సారాంశం

బెంగళూరులో స్కూల్ గర్ల్స్ మధ్య స్ట్రీట్ వార్ జరిగింది. రోడ్డు పక్కనే ఉండే పేవ్‌మెంట్‌పై రెండు గ్యాంగ్‌లుగా విడిపోయి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. జుట్లు పట్టుకుని కొట్టుకోవడం, నెట్టేసుకోవడం, కర్రలతో దాడి చేయడం వంటివి చేశారు. ఇదంతా ఒక అబ్బాయి కోసమే అని కొందరు చెప్పడం గమనార్హం. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయింది.  

బెంగళూరు: సిగపట్లు, కర్రలతో దాడులు, ఒకరినొకరు నెట్టేసుకోవడం.. ఇదేదో గ్యాంగ్ వార్ అనుకుంటే పొరపాటే. అందరూ స్కూల్ స్టూడెంట్లే. అందులో వారంతా గర్ల్ స్టూడెంట్లు. ఈ గర్ల్ స్టూడెంట్లు అందరూ వీధిలో రోడ్డు పక్కనే ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. జుట్లు పట్టుకుని లాక్కున్నారు. ఒకరినొకరు నెట్టేసుకున్నారు. ఒక బాలిక అయితే.. రోడ్డు పక్కనే ఉన్న రెయిలింగ్‌పై విరుచుకుపడింది. అరుపులు, కేకలు, ఆర్తనాదాలతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అయింది.

కర్ణాటక రాజధాని బెంగుళూరులో సెయింట్ మార్క్స్ రోడ్డుపై.. ఓ స్కూల్ భవనానికి అపోజిట్‌లో బాలికలు రెండు గ్యాంగ్‌లు వచ్చి చేరారు. కొందరు స్కూల్ యూనిఫామ్‌లో ఉండగా, ఇంకొందరు క్యాజువల్ డ్రెస్‌లలో ఉన్నారు. ఆ రెండు గ్యాంగ్‌లు ఒకరినొకరు టార్గెట్ చేసుకుంటూ దాడి చేసుకున్నారు. ఆ రోడ్డు పక్కన కార్లు పార్కింగ్ చేసి ఉన్నాయి. ఆ కార్ల పక్కనే పేవ్‌మెంట్‌పై స్ట్రీట్ ఫైట్ మొదలైంది. కొందరు అందులో జుట్టు పట్టుకుని లాగారు. ఇంకొందరు నెట్టేసి కింద పడేశారు. మరికొందరు కర్రలతో దాడి చేశారు. పెద్దగా అరుపులు వినరావడంతో స్థానికులు అక్కడికి పరుగున చేరారు. కానీ, ఆ స్కూల్ గర్ల్స్ మాత్రం దాడి చేయకుండా ఆగలేదు. దీంతో స్థానికులు కలుగజేసుకోవాల్సి వచ్చింది. కొందరు వారిని హెచ్చరించి అక్కడి నుంచి హడలగొట్టి పంపించేశారు. ఈ దాడి తర్వాత చాలా మంది పిల్లలు గాయపడ్డట్టు తెలిసింది. ఈ ఘటన మొత్తం ఒకరు రికార్డ్ చేశారు. కేవలం 24 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.

ఈ ఘటనపై స్కూల్ యాజమాన్యం ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. దీంతో ఫైటింగ్‌కు గల కారణం స్పష్టంగా తెలియలేదు. కానీ, ఆ ఫైటింగ్ మాత్రం ఓ అబ్బాయి కోసం జరిగినట్టు స్థానికులు కొందరు చెప్పారు. అబ్బాయి కోసం గర్ల్స్ గ్యాంగ్ ఫైట్ చేయడం నెట్టింట్లో సంచలనాన్ని సృష్టించింది.

 

కొందరు కలికాలం అని నోరెళ్లబెడితే... మరికొందరు అబ్బాయి కోసం ఇంతలా కొట్లాడుకున్నారంటే తాను నమ్మలేనని పేర్కొన్నారు.

 

PREV
click me!

Recommended Stories

2026 Sankranthi celebrations in Delhi | PM Modi Powerful Pongal Speech | Asianet News Telugu
Makarajyothi: ఘనంగా మకర జ్యోతి ఉత్సవం.. దర్శనానికి పోటెత్తిన లక్షలాది స్వాములు | Asianet News Telugu