జీ 20 సమిట్ కంటే ముందే.. ఆగస్టులోనే ‘‘భారత్’’ను వినియోగించిన కేంద్రం.. !

Published : Sep 06, 2023, 10:58 AM ISTUpdated : Sep 06, 2023, 11:08 AM IST
జీ 20 సమిట్ కంటే ముందే.. ఆగస్టులోనే ‘‘భారత్’’ను వినియోగించిన కేంద్రం.. !

సారాంశం

ఇండియా పేరును భారత్‌గా మార్చే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉందని ప్రచారం జరుగుతుంది. ఈ నెల 18 నుంచి 22వ తేదీ మధ్య ఐదు రోజుల పాటు జరగనున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ఇండియా పేరు మార్పుకు సంబంధించిన బిల్లును కేంద్ర ప్రవేశపెట్టనున్నట్టుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

ఇండియా పేరును భారత్‌గా మార్చే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉందని ప్రచారం జరుగుతుంది. ఈ ఏడాది మన దేశం జీ20కి అతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి జీ20 సభ్య దేశాల అధినేతలు హాజరుకానున్నారు. ఈ క్రమంలోనే వారి కోసం ఈ నెల 9న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విందు ఇస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఇన్విటేషన్ కార్డ్ లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని కాకుండా.. ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని పేర్కొన్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం.. ఆంగ్లంలోనూ ఇండియాగా ఉన్నా దేశ పేరును భారత్‌గా మార్చనుందనే ప్రచారం జోరందుకుంది. ఈ నెల 18 నుంచి 22వ తేదీ మధ్య ఐదు రోజుల పాటు జరగనున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ఇండియా పేరు మార్పుకు సంబంధించిన బిల్లును కేంద్ర ప్రవేశపెట్టనున్నట్టుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

 అయితే జీ 20 సదస్సుకు సంబంధించి రాష్ట్రపతి విందు ఆహ్వానం కంటే ముందే.. ‘‘భారత్’’ అనే పదాన్ని ఉపయోగించారు. అధికారిక ప్రకటనలో భారత్‌ను ఉపయోగించడం ఇది మొదటిది కాదు. ఈ పదాన్ని అంతకు ముందే అధికారిక పత్రంలో ఉపయోగించారు. ఆగస్టులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దక్షిణాఫ్రికాలో జరిగిన 15వ బ్రిక్స్ సదస్సుకు హాజరయ్యారు. ఆ తర్వాత గ్రీస్‌ను కూడా సందర్శించారు. ఆగస్ట్ 22-25 మధ్య మోదీ దక్షిణాఫ్రికా, గ్రీస్ దేశాల పర్యటనకు సంబంధించిన ప్రభుత్వ నోటిఫికేషన్‌లో కూడా ఆయనను ‘‘భారత ప్రధాని (ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్)’’ అని పేర్కొన్నారు. 

ఇక, సెప్టెంబర్ 6, 7 తేదీల్లో 20వ ఆసియాన్ ఇండియా సమ్మిట్, 18వ తూర్పు ఆసియా సదస్సు కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఇండోనేషియాను సందర్శించనున్నారు. మోదీ పర్యటనకు సంబంధించిన ఫంక్షన్ నోట్స్‌లో ఆయనను ‘‘భారత ప్రధాని (ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్)’’ అని పేర్కొన్నారు.

అయితే ఇండియా పేరును పూర్తిగా భారత్ అని మార్చనున్నారనే ఊహాగానాల నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్‌తో పలు విపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇదిలా ఉంటే, దేశం పేరుకు సంబంధించి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 1 ప్రకారం.. ‘‘ఇండియా. అంటే భారత్, రాష్ట్రాల యూనియన్‌గా ఉంటుంది’’ అని ఉంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

బెస్ట్ కాలేజ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? | CS Sharma | Access Career Counselors | Asianet News Telugu
MBA, PGDM.. ఏది చదివితే కెరీర్ బాగుంటుంది?| CS Sharma | Access Career Counselors| AsianetNews Telugu