ఇండియ పేరును భారత్ గా మార్చాలంటున్న బీజేపీపై విరుచుకుపడుతూ కాంగ్రెస్ చేసిన ఓ పోస్ట్ వివాదాస్పదంగా మారింది.
బిజెపిపై విరుచుకుపడటానికి కాంగ్రెస్ చేసిన ప్రయత్నం దానికే రివర్స్ అయ్యింది. భారతదేశానికి భారత్ అని పేరు పెట్టాలనే బీజేపీ ప్రతిపాదనలపై కాంగ్రెస్ విరుచుకుపడింది. కాషాయ శిబిరంపై దాడి చేయడానికి కాంగ్రెస్ నడుం బిగించింది. దీనికోసం కాంగ్రెస్ పోస్ట్ చేసిన వ్యంగ్య చిత్రం బెడిసికొట్టింది.
ఇందులో అనేక స్పెల్లింగ్ మిస్టేక్స్ దొర్లడంతో ఇరుకున పడింది. ఈ తప్పులను బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా వెంటనే గుర్తించారు. దీంతో ఆయన భారత రాజ్యంగప్రవేశిక గురించి కాంగ్రెస్ పార్టీకి తెలియదని మండిపడ్డారు. భారత రాజ్యాంగంపై.. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పై కాంగ్రెస్‌కు గౌరవం లేదని, కాంగ్రెస్ నుంచి ఏమీ ఆశించలేమని నడ్డా అన్నారు.
భారత్ ‘ఇండియా’ను వదిలేస్తే... పాకిస్థాన్ పట్టుకెడుతుంది..
"భారతదేశ రాజ్యాంగ ప్రవేశిక కూడా తెలియని పార్టీ నుండి మనం ఏదైనా ఆశించగలమా. కాంగ్రెస్ = రాజ్యాంగం, డాక్టర్ అంబేద్కర్ పట్ల గౌరవం లేకపోవడం. సిగ్గుచేటు!" అంటూ... కాంగ్రెస్ పార్టీ అధికారిక ఎక్స్ అకౌంట్ లోట్వీట్ చేసిన చిత్రాన్ని షేర్ చేస్తూ నడ్డా కామెంట్ చేశారు. ప్రస్తుతం ఆ ట్వీట్‌ను తొలగించడం గమనార్హం.
తొలగించిన ఈ ట్వీట్‌ను మళ్లీ షేర్ చేస్తూ, కాంగ్రెస్ పార్టీ షేర్ చేసిన రాజ్యాంగపీఠికలోని తప్పులను నడ్డా ప్రత్యేకంగా ఎత్తి చూపారు. దీని ప్రకారం, కాంగ్రెస్ పార్టీ అనేక స్పెల్లింగ్ తప్పులతో భారత రాజ్యాంగంలోని తప్పుడు పీఠికను పంచుకుంది.
మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ X (గతంలో ట్విటర్)లో భారత రాజ్యాంగంలో ఉన్న ఇండియా అనే పదాన్ని ఇంక్ తో చెరిపేయడానికి పెన్ను పట్టుకుని ఉన్న వ్యక్తి (పీఎం మోడీలా కనిపించే) వ్యంగ్య చిత్రాన్ని కాంగ్రెస్ పోస్ట్ చేసిన తర్వాత నడ్డా ఈ విధంగా ప్రతిస్పందించింది. “ఇండియాను నిర్మూలించడం అసాధ్యం” అంటూ దానికి జోడించారు.
Can we expect anything from a party which does not even know India's Preamble....
Congress = Lack of respect for Constitution and Dr. Ambedkar.
Shameful! pic.twitter.com/iKo3Gh1MNu