నడిరోడ్డుపై ఎలుగుబంటి స్వైర విహారం..  గజగజ వణికిన స్థానికులు.. చివరికి ఏమైందంటే..?

Published : Aug 12, 2023, 02:02 PM ISTUpdated : Aug 12, 2023, 02:35 PM IST
నడిరోడ్డుపై ఎలుగుబంటి స్వైర విహారం..  గజగజ వణికిన స్థానికులు.. చివరికి ఏమైందంటే..?

సారాంశం

Karimnagar: కరీంనగర్ పట్టణంలోని రజ్వి చమన్ ప్రాంతంలో ఎలుగు బంటి సంచారం కలకలం రేపుతోంది. అర్థరాత్రి వేళ  యథేచ్ఛగా పలు వీధులలో సంచరించింది. ఈ దృశ్యాలు సీసీ కెమెరా లో నమోదయ్యాయి. 

Karimnagar: ఇటీవల రోడ్లపై కోతులు, కుక్కలు సంచరిస్తూ భయపెడుతుంటాయి. ప్రధానంగా కుక్కలు వీధుల్లో స్వైర విహారం చేశాయి. కనపడితే చాలు.. మీద పడి దాడి చేశాయి. వీటివల్ల చాలా మంది చిన్నారులు గాయపడుతున్నారు. కొంతమంది చిన్నారులు తమ ప్రాణాలను సైతం కోల్పోయిన ఘటనలున్నాయి. మరోవైపు.. గ్రామాల్లో, పట్టణాల్లో కోతులు వీర విహారం చేస్తుంటాయి. వాటి కంటబడితే.. చాలు వాళ్ల పని అయిపోయినట్టే.. అవి గుంపులు గుంపులుగా వచ్చి మరీ దాడులు చేస్తుంటాయి. 

ఇదిలా ఉంటే.. ఎలుగుబంట్లు కూడా జనావాసాల్లోకి వచ్చి దాడులు చేస్తున్నాయి. తాజాగా.. కరీంనగర్ పట్టణంలోని రజ్వి చమన్ ప్రాంతంలో ఎలుగు బంటి సంచారం కలకలం రేపుతోంది. అర్థరాత్రి వేళ  యథేచ్ఛగా పలు వీధులలో సంచరించింది. ఈ దృశ్యాలు సీసీ కెమెరా లో నమోదయ్యాయి. 

ఎలుగుబంటి ని గుర్తించిన స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు .డయల్  100కు ఫోన్ చేసి సమాచారం అందించారు. రాత్రి సమయంలో అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చినా అధికారులు స్పందించక పోవడంతో స్థానిక యువకులు కర్రలతో ఎలుగుబంటిని తరిమే ప్రయత్నం చేశారు.

నిన్న రాత్రి కరీంనగర్ పట్టణంలోని పలు వీధులలో సంచరించిన ఎలుగుబంటిని రేకుర్తి సమీపంలో గుర్తించిన ఫారెస్ట్ అధికారులు ఎలుగును పట్టుకునేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. మత్తుమందు, వలలతో ఎలుగుబంటి వెంట పరిగెత్తారు.

మొదట వలలతో ఎలుగుబంటిని అందించడానికి ప్రయత్నించిన అధికారులు విఫలమయ్యారు. ఎలుగుబంటి వలలో నుండి తప్పించుకుని సమీపంలోని చెట్ల పొదలలోకి పారిపోయే ప్రయత్నం చేయగా ఫారెస్ట్ అధికారులు మత్తు ఇంజక్షన్ వేశారు. మత్తు ఇంజక్షన్ వేసినా అనంతరం ఎలుగుబంటి గోడ దూకి పారిపోయింది. 

అధికారులు గాలింపులో ఎట్టకేలకు ఎలుగుబంటి చిక్కింది. అధికారులు ఎలుగుబంటిని పట్టుకుని రెస్క్యూ వాహనంలో తరలించారు. దీంతో ప్రజలంగా ఊపిరి పీల్చుకున్నారు. ఎలుగుబంటి సంచారం వార్త సోషల్ మీడియాలో దావానంల వ్యాపిoచడంతో పట్టణ ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు.

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్