భర్తనే యముడయ్యాడు.. ఆస్తి కోసం వైద్యురాలిని కడతేర్చిన వైద్యుడు.. 

Published : Aug 12, 2023, 01:19 PM IST
భర్తనే యముడయ్యాడు.. ఆస్తి కోసం వైద్యురాలిని కడతేర్చిన వైద్యుడు.. 

సారాంశం

మచిలీపట్నంలో దారుణం జరిగింది. తన సొంత భార్యను అత్యంత క్రూరంగా కడతేర్చాడు ఓ వైద్యుడు . ఆస్తులపై మమకారంతో తన నలభై యేండ్ల దాంపత్య బంధాన్ని తెంచుకున్నాడు. 

మచిలీపట్నంలో దారుణం జరిగింది. రోగుల ప్రాణాలు కాపాడాల్సిన వైద్యుడే.. తన సొంత భార్యను అత్యంత క్రూరంగా కడతేర్చాడు. ఆస్తులపై మమకారంతో తన నలభై యేండ్ల దాంపత్య బంధాన్ని తెంచుకున్నాడు. తన వైద్య వృత్తికే కళంకం తెచ్చాడు. ఈ దారుణ ఘటన కృష్ణాజిల్లా మచిలీపట్నంలో చోటుచేసుకుంది.

మృతురాలు కూడా  వైద్యురాలే కావడం శోచనీయం. ఈ ఘటనలో పిల్లల వైద్యులు లోక్నాథ్ మహేశ్వరరావును ప్రధాన నిందితుడిగా పోలీసులు గుర్తించారు. అలాగే ఈ హత్యకు సహకరించిన కారు డ్రైవర్ మధును కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. అనంతరం వారిద్దరిని కోర్టులో హాజరు పరిచినట్లు ఎస్పీ తెలిపారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మచిలీపట్నం లోని జవహార్ పేట లో 25 సంవత్సరాలుగా వైద్య దంపతులైన మహేశ్వరరావు, రాధా నివాసం ఉంటూ.. వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ క్రమంలో గత నెల 25న రాత్రి..తన భార్య, వైద్యురాలు రాధను హత్య చేసి నగలు దొంగలించినట్లు వైద్యుడు లోక్నాథ్ మహేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు తమదైన షేర్లు దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. భర్తనే భార్యను అంతమొందించి.. హత్యగా చిత్రీకరించాడని గుర్తించారు. ఈ క్రమంలో తన వద్ద గత 15 సంవత్సరాలుగా పనిచేస్తున్న డ్రైవర్ మధు సహకారం తీసుకున్నట్టు పోలీసులు గుర్తించారు డ్రైవర్ కు భారీ మొత్తంలో బంగారం నగలు ఇస్తానని నిందితుడు ఆశ చూపించినట్టు గుర్తించారు. 

పక్కా ప్లాన్ ప్రకారం.. 

గత నెల 24వ తేదీన సాయంత్రం ఆస్పత్రిలో ఒంటరిగా ఉన్న వైద్యురాలు రాధ వద్దకు లోక్నాథ్, అతని డ్రైవర్ మధు వెళ్లారు. డ్రైవర్ మధు వైదురాలు రాదను పట్టుకోగా భర్త లోక్నాథ్ ఆమె తలపై రెంచుతో బలంగా కొట్టాడు. దీంతో ఆమె తలకు గాయం అయింది. రక్తం మడుగులో పడిపోయింది. పోలీసుల దర్యాప్తులో దొరకకుండా ఘటనస్థలంలో కారం చల్లారు. దొంగతనం జరిగిందని విధంగా ఆమె ఒంటిపై నగలను లాగి పరేశారు.
 
అనంతరం అక్కడి నుండి వెళ్లిపోయారు. తనకేమీ తెలియనట్టు డాక్టర్ లోక్నాథ్ మహేశ్వర్ రావు కింది అంతస్తు లోరి తన ఆసుపత్రి లో రోగులకు వైద్యం చేస్తున్నట్లు నటించాడు. రాత్రి 10:30 ప్రాంతంలో ఆస్పత్రిలోనే కాలక్షేపం చేశాడు. అనంతరం పోలీసులకు ఫోన్ చేసి తన భార్యకు గురైనట్లు సమాచారం అందించాడు. 

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో వైద్యుడు లోక్నాథ్ అనుమానాస్పదంగా వ్యవహరించడంతో పోలీసులు అతనిపై ఓ కన్నేశారు. సొంత భార్య హత్యకు గురైన ఏమాత్రం బాధపడకపోవడం.. మరుసటి రోజు తన ఆస్పత్రిలో వైద్య వైద్య సేవలు ప్రారంభించడం. పలు అనుమానాలకు దారితీసాయి. లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులకు వైద్యుడే హంతకుడు అని చేసింది.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్