కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీకి ఎన్నికల కమిషన్ పలు సూచలను చేసింది. ప్రధాని నరేంద్ర మోడీపై వ్యాఖ్యలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఆదేశించింది. గత నవంబర్ లో ప్రధానిపై ఆయన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఈ విధంగా స్పందించింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై వ్యాఖ్యలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది. కొంత కాలం కిందట ప్రధానిపై రాహుల్ గాంధీ చేసిన కొన్ని వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకున్న తరువాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎన్నికల సంఘం తెలిపింది.
వచ్చే ఐదేళ్లలో ప్రపంచ ఆర్థిక వృద్ధిలో భారత్ ది కీలక పాత్ర - ఐఎంఎఫ్
నవంబర్ 22న ప్రధాని మోడీకి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ చేసిన ప్రసంగం సరిగా లేదని, దీనిపై 8 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు డిసెంబర్ 21న ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఈసీ ఈ చర్యకు పూనుకుంది. అలాగే గత ఎన్నికల సమయంలో ఎంసీసీ ఉల్లంఘలు, ఇటీవల జరిగిన ఎన్నికల్లో వివిధ ధోరణులు, రాజకీయ ప్రచార సరళి దిగజారిన సందర్భాలను పరిగణనలోకి తీసుకుని అన్ని పార్టీలు హుందాతనాన్ని పాటించాలని కోరింది.
ఓటర్ల కుల, మత భావాల ఆధారంగా వ్యాఖ్యలు చేయరదాని, ప్రస్తుతం ఉన్న విభేదాలను మరింత తీవ్రతరం చేసే లేదా పరస్పర విద్వేషాలను సృష్టించే లేదా వివిధ కులాలు, వర్గాలు, మత, భాషా సమూహాల మధ్య ఉద్రిక్తతకు కారణమయ్యే కార్యకలాపాలను చేయరాదని హెచ్చరించింది.
నేడు కాంగ్రెస్ సీఈసీ మీటింగ్.. లోక్ సభ అభ్యర్థుల జాబితా విడుదల చేసే ఛాన్స్ ?
ఓటర్లను తప్పుదోవ పట్టించే విధంగా రాజకీయ పార్టీలు, నాయకులు అవాస్తవాలు, ప్రకటనలు చేయరాదని ఆదేశించింది. లేని పోని ఆరోపణలు, వక్రీకరణల ఆధారంగా ఇతర పార్టీలను, నాయకులను విమర్శించడం మానుకోవాలని సూచించింది. ప్రత్యర్థులను కించపరిచేలా వ్యక్తిగత దూషణలకు దిగవద్దని పార్టీలు, నేతలకు ఆదేశించింది.
శెభాష్ రా బుడ్డోడా.. చిరుతను ఇంట్లో బంధించిన పిల్లాడు.. వీడియో వైరల్..
కాగా.. పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గతేడాది నవంబర్ లో ప్రధాని నరేంద్ర మోడీపై రాహుల్ గాంధీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. క్రికెట్ వరల్డ్ కప్ లో భారత్ ఓడిపోవడాన్ని ప్రస్తావిస్తూ.. టీమ్ ఇండియా ఓటమికి ప్రధాని మోడీయే కారణమని అన్నారు. మన టీమ్ దాదాపుగా వరల్డ్ కప్ గెలుచుకుందని, కానీ ఓ చెడు శకునం (పనౌటి) రావడం వల్ల వారు ఓడిపోయారని ప్రధానిని ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఆ సమయంలో వివాదంగా మారాయి.