గబ్బిలాలకు పూజలు.. లక్ష్మీదేవిగా కొలుస్తున్న ఆ వింత గ్రామం.. ఎందుకో తెలుసా ?

By Sairam Indur  |  First Published Jan 12, 2024, 2:35 PM IST

గబ్బిలాలను (bats) చూస్తే చాలా మంది ఆమడదూరం పరిగెడుతారు. కొందరు వాటిని చూసేందుకు గానీ, పట్టుకునేందుకు గానీ అస్సలు ఇష్టపడరు. అలాంటి జీవులను ఓ గ్రామం మొత్తం దైవంతో సమానంగా పూజిస్తారని తెలుసా ? (Bats are worshipped in the village). పూజలు చేయడమే కాదు.. వాటికి నైవేద్యం పెట్టకుండా ఏ శుభకార్యమూ చేయరు. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడుంది ? ఏమిటా ఆ గ్రామం కథ.. పదండి తెలుసుకుందాం..


గబ్బిలాలును చూసేందుకు, పట్టుకునేందుకు చాలా మంది ఇష్టపడరు. కొన్ని చోట్ల వాటిని అశుభంగా కూడా భావిస్తారు. తలకిందులుగా వేళాడుతూ తిరిగే ఈ జీవులను శాస్త్రీయంగా పక్షి అని కాకుండా క్షీరదం అని పిలుస్తారు. ఎందుకంటే ఈ జీవులు తమ పిల్లలకు పాలు ఇచ్చి పెంచుతాయి. అయితే కరోనా సమయంలో వీటిని మానవాళికి శత్రువులుగా కూడా భావించారు. కానీ వాటిని ఓ గ్రామంలో దైవంతో సమానంగా కొలుస్తారు. వాటికి పూజలు చేస్తారు.

సీఈసీ, ఈసీలను నియామించే కొత్త చట్టంపై స్టేకు సుప్రీంకోర్టు నిరాకరణ.. కేంద్రానికి నోటీసులు..

Latest Videos

undefined

బీహార్ లోని వైశాలి జిల్లాలో ఉంది ఆ గ్రామం. ఆ ఊరి పేరు సర్సాయి. ఇక్కడ ఎన్నో ఏళ్ల నుంచి ఆ గబ్బిలాలకు పూజలు చేస్తారు. అవి తమని రక్షిస్తాయని గ్రామస్తులందరూ నమ్ముతారు. అలాగే గబ్బిలాలు బతికే చోట డబ్బుకు కొదవ ఉండదని అక్కడి ప్రజల ప్రగాఢ విశ్వాసం. గ్రామం మధ్యలో ఉన్న పురాతన సరస్సు సమీపంలో ఉన్న రావి, సమీర్, బదువా చెట్లలో ఈ గబ్బిలాలు నివసిస్తున్నాయి. అయితే ఇక్కడికి గబ్బిలాలు ఎక్కడి నుంచి వచ్చాయో ఇప్పటికీ స్పష్టత లేదు.

ప్రజా భవన్ కు వైఎస్ షర్మిల ... డిప్యూటీ సీఎం భట్టితో భేటీ

గ్రామంలో ఉన్న పురాతన సరస్సును క్రీస్తు పూర్వం 1402 లో తిర్హుత్ రాజు శివ సింగ్ నిర్మించాడని చెబుతారు. ఈ సరస్సును ఆనుకుని ఉన్న 50 ఎకరాల్లో అనేక దేవాలయాలు ఉన్నాయి. అయితే రాత్రి సమయంలో చెరువు దగ్గరకు వెళితే అక్కడున్న గబ్బిలాలు అరుస్తాయి. కానీ ఆ గ్రామస్తులు వెళ్తే మాత్రం అవి ఎలాంటి అలజడి చేయవు.  గబ్బిలాలు లేకుండా ఏ మతపరమైన వేడుక కూడా చేయరు. వాటిని పూజించడంతో పాటు సంరక్షిస్తారు. అందుకే ఇక్కడ గబ్బిలాల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది.

OpenAI CEO లవ్ మ్యారేజ్ .. ఎవర్నీపెళ్లి చేసుకున్నాడో తెలిస్తే దిమ్మతిరిగాల్సిందే..!

ఆ గ్రామస్తులు గబ్బిలాలకు నైవేద్యం సమర్పించకుండా ఏ శుభకార్యాన్ని పూర్తి చేయరు. అక్కడ ప్రజలంతా వాటిని  సంపదకు రూపంగా, అదృష్టంగా భావించడంతో పాటు లక్ష్మీదేవితో పోలుస్తూ కొలుస్తారు. మధ్యయుగంలో వైశాలి నదిని ఒక పెద్ద అంటువ్యాధి తాకిందని, దీంతో చాలా మంది ప్రాణాలు కోల్పోయారని అక్కడి గ్రామస్తులు చెబుతుంటారు. అదే సమయంలో అక్కడి మొదటి సారిగా గబ్బిలాలు వచ్చాయని, ఇక అప్పటి నుంచి ఆ గ్రామంలో ఏ అంటువ్యాధులు ప్రబలలేదట. అందుకే గ్రామాన్ని చూసేందుకు సందర్శకులు తరలివస్తారు.

click me!