మందుబాబులకు మరో శుభవార్త: బార్లు, పబ్బులు కూడా ఓపెన్.....

By Sree s  |  First Published May 9, 2020, 9:58 AM IST

సుప్రీమ్ కోర్ట్ సూచనల అనుసారం, మద్యం షాపుల ముందు రద్దీని తగ్గించేందుకు బార్లను, పబ్బులను కూడా తెరవడానికి కర్ణాటక సర్కార్ నిర్ణయం తీసుకుంది. బార్లు, పబ్బుల్లో ఎమ్మార్పీ ధరకు మద్యాన్ని టేక్ అవే రూపంలో అమ్మాలని ఆదేశించింది. 


దేశంలో మూడవదఫా విధించిన లాక్ డౌన్ లో చాలా సడలింపులు ఇచ్చింది కేంద్రం. అందులో ప్రధానంగా మద్యం షాపులకు ఇచ్చిన అనుమతులతో మందుబాబులు పండగ చేసుకుంటున్నారు. మద్యం షాపుల ముందు పూజలు చేయడం నుంచి మొదలు టపాకాయలు కాల్చడం వరకు వివిధ రూపాల్లో తమ సంతోషాన్ని వ్యక్తం చేసారు. 

ఇకపోతే... ఇలా మద్యం షాపులకు అనుమతులిచ్చేసరికి మందుబాబులు మద్యం షాపుల ముందు విపరీతంగా క్యూలు కట్టారు. ఇలా మద్యం షాపుల ముందు గుమికూడడం పై పలువురు ఆందోళన వ్యక్తం చేసారు. 

Latest Videos

కరోనా వైరస్ ను ఎదుర్కోవడానికి ఇన్ని రోజులు తీసుకున్న చర్యలు బూడిదలో పోసిన పన్నీరే అవుతాయని ఆంధ్రప్రదేశ్ సర్కారుకి జూనియర్ డాక్టర్లు లేఖ కూడా రాసారు. తాజాగా సుప్రీమ్ కోర్టు కూడా ఇలా మందుబాబులు మద్యం షాపుల ముందు క్యూలు కట్టకుండా లిక్కర్ ని హోమ్ డెలివరీ చేయడం కానీ, వేరే ఏవైనా ఇతరాత్రా మార్గాలను కూడా ఆలోచించాలని సూచించింది. 

ఈ సుప్రీమ్ కోర్ట్ సూచనల అనుసారం, మద్యం షాపుల ముందు రద్దీని తగ్గించేందుకు బార్లను, పబ్బులను కూడా తెరవడానికి కర్ణాటక సర్కార్ నిర్ణయం తీసుకుంది. బార్లు, పబ్బుల్లో ఎమ్మార్పీ ధరకు మద్యాన్ని టేక్ అవే రూపంలో అమ్మాలని ఆదేశించింది. 

ఈ బార్లు, పబ్బుల్లో అక్కడే మద్యం సేవించదానికి ఎటువంటి అనుమతులు లేవని స్పష్టం చేసింది. అక్కడ మద్యం కేవలం అమ్మడానికి మాత్రమే అనుమతులని తెలిపింది. కేంద్రం విధించిన మూడవ లాక్ డౌన్ అమలులో ఉండే మే 17 వతేది వరకు  ఇలా అమ్మకాలను జరుపుకోవచ్చని తెలిపింది. 

ఇకపోతే... భారతదేశంలో కరోనా వైరస్ మహమ్మారి విధ్వంసం సృష్టిస్తూనే ఉంది. శనివారం ఉదయం కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం... కోవిడ్ -19 కేసుల సంఖ్య 60 వేలకు చేరువ కాగా, మరణాలు 2 వేలకు చేరువగా వచ్చాయి. దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 59,662 నమోదయ్యాయి. కరోనా వైరస్ మరణాల సంఖ్య 1,981కి చేరుకుంది.

ఇప్పటి వరకు కోరనా వ్యాధి నుంచి 17,846 మంది కోలుకున్నారు. దాంతో యాక్టవ్ కేసుల సంఖ్య 39,834 ఉంది. గత 24 గంటల్లో కొత్తగా 3320 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కొత్తగా 95 మరణాలు సంభవించాయి.

గత కొద్ది రోజులుగా భారతదేశంలో కరోనావైరస్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ప్రతి రోజూ 3 వేలకుపైగానే కొత్త కోవిడ్ -19 కేసులు నమోదవుతూ వస్తున్నాయి. ఇప్పటి వరకు దేశంలో 216 జిల్లాలో కొత్తగా కరోనా వైరస్ కేసులు నమోదు కాలేదు. 

click me!