డాక్టర్ సూసైడ్ నోట్ లో ఎమ్మెల్యే పేరు.. అరెస్ట్ కి రంగం సిద్ధం

By telugu news teamFirst Published May 9, 2020, 7:26 AM IST
Highlights

జర్వాల్ కనిపించకుండా పోవడంతో అతని తండ్రి, సోదరులను పోలీసులు విచారిస్తున్నారు. కాగా.. గత నెలలో డాక్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు ఆయన రాసిన ఓ సూసైడ్ నోట్ తీవ్రంగా కలవరం రేపింది.

దేశ రాజధాని ఢిల్లీలో 52 ఏళ్ల డాక్టర్ ఇటీవల ఆత్మహత్య చేసుకున్నాడు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే ప్రకాశ్ జర్వాల్‌ వేధింపులు భరించలేక తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అతను సూసైడ్ నోట్ లో రాశాడు. ఆ మేరకు అతను రెండు పేజీల సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు.

కాగా...గత నెలలో జరిగిన ఘటనపై ఆ ఎమ్మెల్యేకు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయింది. ఢిల్లీలోని డియోలీ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యేపై వారెంట్ ఇష్యూ అయింది. పోలీసులు ఈ కేసులో మరో నిందితుడైన కపిల్ నగర్‌కు, ప్రకాశ్ జర్వాల్‌ల గురించి వెదుకుతున్నారు. 

జర్వాల్ కనిపించకుండా పోవడంతో అతని తండ్రి, సోదరులను పోలీసులు విచారిస్తున్నారు. కాగా.. గత నెలలో డాక్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు ఆయన రాసిన ఓ సూసైడ్ నోట్ తీవ్రంగా కలవరం రేపింది.

ఎమ్మెల్యే ప్రకాశ్ జర్వాల్‌, అతని అనచురుడు తనను డబ్బులు డిమాండ్ చేశారని, తను నిరాకరించడంతో తన వ్యాపార ప్రయోజనాలను దెబ్బ తీసే పనికి ఒడిగట్టారని డాక్టర్ ఆరోపించాడు. మృతుడు రాజేంద్ర సింగ్ ఢిల్లీలోని నేబ్ సరాయ్ ఏరియాలో ఉంటున్నాడు. అతనికి వాటర్ ట్యాంకర్ సర్వీస్ ఉంది. 

డాక్టర్ ఉరేసుకోవడాన్ని ఇంట్లో అద్దెకు ఉంటున్న వ్యక్తి గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. తన సూసైడ్ నోట్ లో రాజేంద్ర సింగ్ ఆప్ ఎమ్మెల్యే ప్రకాశ్ జర్వాల్ ను, అతని అనుచరుడు కపిల్ నాగర్ ను నిందించాడు. 

పోలీసులు డాక్టర్ వ్యక్తిగత డైరీని కూడా స్వాధీనం చేసుకున్నారు. 

డైరీలో తాను వేధింపులకు గురైన విషయాన్ని రాసినట్లు భావిస్తున్నారు. తన ట్యాంకర్లను ఢిల్లీ జల్ బోర్డు ్ద్దెకు తీసుకుంది. దానికి ఎమ్మెల్యే డబ్బులు డిమాండ్ చేశాడని, తను ఇవ్వడానికి నిరాకరించడంతో జల్ బోర్డు సర్వీసు నుంచి తన ట్యాంకర్లను తీసేయించారని డాక్టర్ తన డైరీలో రాసుకున్నాడు. 

డాక్టర్ మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఎయిమ్స్ కు తరలించారు. ఎమ్మెల్యేపై, అతని అనుచరుడిపై కేసులు నమోదు చేశారు. 
 

click me!