భారతదేశంలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 60 వేలకు చేరువ కాగా, మృతుల సంఖ్య 2 వేలకు దగ్గరలో ఉంది. రోజూ 3 వేల పైనే కేసులు నమోదవుతున్నాయి.
న్యూఢిల్లీ: భారతదేశంలో కరోనా వైరస్ మహమ్మారి విధ్వంసం సృష్టిస్తూనే ఉంది. శనివారం ఉదయం కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం... కోవిడ్ -19 కేసుల సంఖ్య 60 వేలకు చేరువ కాగా, మరణాలు 2 వేలకు చేరువగా వచ్చాయి. దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 59,662 నమోదయ్యాయి. కరోనా వైరస్ మరణాల సంఖ్య 1,981కి చేరుకుంది.
ఇప్పటి వరకు కోరనా వ్యాధి నుంచి 17,846 మంది కోలుకున్నారు. దాంతో యాక్టవ్ కేసుల సంఖ్య 39,834 ఉంది. గత 24 గంటల్లో కొత్తగా 3320 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కొత్తగా 95 మరణాలు సంభవించాయి.
గత కొద్ది రోజులుగా భారతదేశంలో కరోనావైరస్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ప్రతి రోజూ 3 వేలకుపైగానే కొత్త కోవిడ్ -19 కేసులు నమోదవుతూ వస్తున్నాయి. ఇప్పటి వరకు దేశంలో 216 జిల్లాలో కొత్తగా కరోనా వైరస్ కేసులు నమోదు కాలేదు.
మహారాష్ట్రలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. మహారాష్ట్రలో కోవిడ్ -19 పాజిటివ్ కేసుల సంఖ్య 19,089కి చేరుకుంది. శుక్రవారంనాడు కొత్దగా 1,089 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 37 మదంి మృత్యువాత పడ్డారు. దీంతో మహారాష్ట్రలో మరణాల సంఖ్య 731కి చేరుకుంది.
లాక్ డౌన్ నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకుపోయిన పౌరులను వెనక్కి తీసుకుని రావడానికి భారత ప్రభుత్వం వందే భారత్ మిషన్ ను చేపట్టింది. తొలి రెండు విమానాలు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో చిక్కుకపోయిన 363 మందిని కేరళకు తీసుకుని వచ్చాయి.