కుక్కలా మొరుగు.. మధ్యప్రదేశ్‌లో కుక్క తాడును వ్యక్తి మెడకు కట్టి బెదిరింపులు.. వీడియో వైరల్

Published : Jun 19, 2023, 04:11 PM IST
కుక్కలా మొరుగు.. మధ్యప్రదేశ్‌లో కుక్క తాడును వ్యక్తి మెడకు కట్టి బెదిరింపులు.. వీడియో వైరల్

సారాంశం

మధ్యప్రదేశ్‌లో  ఓ వ్యక్తి మెడకు కుక్క తాడు కట్టారు. ఆ తాడును పట్టి లాగుతూ భయపెట్టారు. కుక్కల మొరగాలని ఆదేశించారు. బాధితుడు తానేమీ చేయలేదని, తనను వదిలిపెట్టాలని ప్రాధేయపడుతున్నాడు. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసలు యాక్షన్ తీసుకున్నారు.  

భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఓ నేరం వెలుగులోకి వచ్చింది. ముగ్గురు వ్యక్తులు కలిసి ఒకరి మెడకు కుక్క తాడును కట్టారు. చుట్టుముట్టి బెదిరిస్తున్నారు. కుక్కలా మొరుగు అని కూడా వేధించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోపై దర్యాప్తు చేయాలని మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తం మిశ్రా ఈ రోజు పోలీసులను ఆదేశించారు. 24 గంటల్లో తగిన చర్య తీసుకోవాలని పోలీసు కమిషనర్‌కు ఆదేశాలు పంపారు.

48 సెకండ్ల నిడివి గల ఆ వీడియోలో కుక్కల మారాలని బాధితుడిని బెదిరిస్తున్నారు. క్షమాపణలు కోరాలని డిమాండ్ చేశారు. పోలీసులు కేసు ఫైల్ చేశారు. సమీర్, సాజిద్, ఫైజాన్‌లను అరెస్టు చేశారు. బాధితుడదిని విజయ్ రామచందానిగా గుర్తించారు. మధ్యప్రదేశ్ మత స్వేచ్ఛ చట్టం, అపహరణ, బంధించడం, ఉద్దేశపూర్వకంగా హాని తలపెట్టడం వంటి ఆరోపణలతో కేసు నమోదు చేశారు.

Also Read: ప్రతిపక్షాల ప్రధాన మంత్రి అభ్యర్థి ఎవరు?.. బీజేపీ ప్రశ్నలకు విపక్షాల సమాధానం ఇదే

ఆ ముగ్గురినీ వేడుకుంటూ బాధితుడు పలు మాటలు అన్నారు. ‘సాహిల్ బాయ్ నా నాన్న, నా పెద్ద అన్న. ఫైజాన్ బాయ్ నా సోదరుడు. నా తల్లే ఆయన తల్లి, ఆయన తల్లే నా తల్లి’ అని ఆయన అంటున్నాడు.

కుక్కల అరువు అనగానే.. సాహిల్ భాయ్.. నేనేమీ చేయలేదు అని సమాధానం ఇచ్చాడు. దయచేసి తనను వదిలిపెట్టాలని ప్రాధేయపడ్డాడు. ఈ వీడియో వైరల్ అయింది.

PREV
click me!

Recommended Stories

Nitin Nabin : బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మోదీ నమ్మిన బంటు.. ఎవరీ నితిన్ నబిన్?
Indian Railways : ఇండియన్ రైల్వే బంపర్ ఆఫర్.. తక్కువ ఖర్చుతో దేశమంతా తిరిగేయండిలా !