బాయ్‌ఫ్రెండ్‌తో పారిపోవ‌డానికి కిడ్నాప్ క‌థ అల్లిన టీనేజీ అమ్మాయి..

Published : Jun 19, 2023, 03:40 PM IST
బాయ్‌ఫ్రెండ్‌తో పారిపోవ‌డానికి కిడ్నాప్ క‌థ అల్లిన టీనేజీ అమ్మాయి..

సారాంశం

Palghar: ఒక టీనేజ్ అమ్మాయి తన సొంత కిడ్నాప్‌ను క‌థ‌ను అల్లింది. ఈ క్ర‌మంలోనే బాయ్‌ఫ్రెండ్‌తో కోల్‌కతాకు పారిపోయింది. పోలీసులు ఇద్దరిని ట్రేస్ చేస్తున్నారు. ఈ ఘ‌ట‌న మహారాష్ట్రలో చోటుచేసుకుంది. పాల్ఘర్ జిల్లాకు చెందిన 17 ఏళ్ల యువతి తన కిడ్నాప్ కథను తానే సిద్ధం చేసుకుని తన ప్రియుడితో కలిసి కోల్‌కతాకు పారిపోయిందనీ, వీరిద్దరి ఆచూకీ కోసం పోలీసు బృందం కోల్‌కతా వెళ్లిందని సంబంధిత అధికారులు తెలిపారు.   

Maharashtra teen fakes her own kidnapping: ఒక టీనేజ్ అమ్మాయి తన సొంత కిడ్నాప్‌ను క‌థ‌ను అల్లింది. ఈ క్ర‌మంలోనే బాయ్‌ఫ్రెండ్‌తో కోల్‌కతాకు పారిపోయింది. పోలీసులు ఇద్దరిని ట్రేస్ చేస్తున్నారు. ఈ ఘ‌ట‌న మహారాష్ట్రలో చోటుచేసుకుంది. పాల్ఘర్ జిల్లాకు చెందిన 17 ఏళ్ల యువతి తన కిడ్నాప్ కథను తానే సిద్ధం చేసుకుని తన ప్రియుడితో కలిసి కోల్‌కతాకు పారిపోయిందనీ, వీరిద్దరి ఆచూకీ కోసం పోలీసు బృందం కోల్‌కతా వెళ్లిందని సంబంధిత అధికారులు తెలిపారు. 

వివ‌రాల్లోకెళ్తే.. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాకు చెందిన 17 ఏళ్ల బాలిక న‌కిలీ కిడ్నాప్ కథను అల్లింది. త‌ర్వాత త‌న ప్రియుడితో కలిసి కోల్ క‌తాకు పారిపోయింది. పాల్ఘర్ లోని విరార్ ప్రాంతానికి చెందిన యువతి ఓ కంపెనీలో హౌస్ కీపింగ్ విభాగంలో పనిచేస్తూ శుక్రవారం (జూన్ 16) పనికి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదని విరార్ పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్‌స్పెక్టర్ కల్యాణ్ కర్పే తెలిపారు.

దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈలోగా బాలిక తన సోదరుడికి వాట్సాప్ వాయిస్ మెసేజ్ లో తనను కిడ్నాప్ చేశారని పేర్కొంది. ఆందోళ‌న‌కు గురైన బాలిక కుటుంబ స‌భ్యులు సోలీసుల‌ను ఆశ్ర‌యించారు. టీనేజీ అమ్మాయి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఐపీసీ సెక్షన్ 363 (కిడ్నాప్) కింద కేసు నమోదు చేశారు.

పోలీసుల దర్యాప్తు బృందం పలు ఆధారాలతో దర్యాప్తు చేయగా యువతి తన ప్రియుడితో కలిసి పశ్చిమ బెంగాల్ లోని కోల్ కతాకు విమానంలో వెళ్లినట్లు తెలిసింది. వీరిద్దరి ఆచూకీ కనుగొనేందుకు పోలీసు బృందం కోల్ క‌తాకు వెళ్లిందని పోలీసు ఉన్న‌తాధికారులు తెలిపారు.

కాగా, ఇలాంటి నకిలీ కిడ్నాప్ లకు సంబంధించిన కేసులు తెరపైకి రావడం ఇదే మొదటిసారి కాదు. ఈ ఏడాది మే నెలలో 16 ఏళ్ల బాలిక తన అపహరణ గురించి కథ అల్లి తన ఆరేళ్ల సోదరితో కలిసి కోల్ క‌తా నుంచి పారిపోయింది. పరీక్షల్లో త‌క్కువ మార్కులు రావడంతో బాలిక తల్లిదండ్రులను చూసి భయపడింది. ఈ క్ర‌మంలోనే కిడ్నాప్ క‌థ‌ను న‌డిపించింది. బాలికను కిడ్నాప్ క‌థ‌తో ఆగ‌కుండా రూ.కోటి డిమాండ్ చేసి తండ్రి నుంచి డబ్బులు కాజేసేందుకు ప్రయత్నించింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Nitin Nabin : బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మోదీ నమ్మిన బంటు.. ఎవరీ నితిన్ నబిన్?
Indian Railways : ఇండియన్ రైల్వే బంపర్ ఆఫర్.. తక్కువ ఖర్చుతో దేశమంతా తిరిగేయండిలా !