బంగ్లాదేశ్ నుండి భారత్ లోకి అక్రమ చొరబాట్లు ఇప్పటికే ఆందోళనకరంగా మారాయి. ఇలాంటి సమయంలో ఓ ఆకతాయి యూట్యూబర్ చేసిన పని మన దేశ భద్రతకే ముప్పు తెచ్చేలా వుంది. ఇంతకీ ఆ వీడియో ఏమిటంటే...
మన పొరుగుదేశం బంగ్లాదేశ్ లో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. రిజర్వేషన్లపై ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగడంతో దేశవ్యాప్తంగా ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో బంగ్లాలోని భారతీయులను స్వదేశానికి తరలిస్తోంది మోదీ సర్కార్. ఇదే సమయంలో కొందరు భారతీయులు కూడా అక్రమంగా బార్డర్ దాటి మన దేశంలోకి ప్రవేశిస్తున్నారు.
అయితే ఇలా బంగ్లాదేశ్ నుండి అక్రమంగా చొరబడుతుండటం దేశ భద్రతకే ముప్పులా మారే అవకాశాలున్నాయి. శరణార్థుల మాదిరిగానే ఉగ్రవాదులు కూడా ఈ మార్గంలోనే దేశంలోకి చొరబడే అవకాశాలుంటాయి. కాబట్టి ఇలా బంగ్లాదేశీలు బార్డర్లు దాటుకుని రాకుండా చర్యలు తీసుకుంటోంది భారత ప్రభుత్వం.
ప్రభుత్వం ఎంత పకడ్బందీగా వ్యవహరించినా బంగ్లాదేశీలు మారడం లేదు. ఏదో మార్గంలో మన దేశంలోకి వస్తూనే వున్నారు. తాజాగా బంగ్లా యూట్యూబర్ బరితెగించి ఇండియాలోకి అక్రమంగా ఎలా ఎంటర్ అవ్వొచ్చో వీడియో తీసిమరీ యూట్యూబ్ లో పెట్టాడు. ఈ యూట్యూబ్ వీడియో భారత భద్రతకే ముప్పుతెచ్చెలా వుంది.
పటిష్టంగా వున్న పెన్సింగ్ ను ఎలా దాటేది... అక్కడివరకు ఎలా వేళ్లేది... మొత్తం వీడియో తీసాడు. ఇలా అతడి వీడియోతో బంగ్లాదేశ్ నుండి అక్రమ చొరబాట్లు మరింత పెరిగే అవకాశం వుంది. ఇలా దేశ భద్రతకే ముప్పు వాటిల్లెలా వీడియో తీసిన యూట్యూబర్ పై చర్యలకు భారత ప్రభుత్వం సిద్దమయ్యింది. ఈ విషయంలో బంగ్లాదేశ్ తో చర్చించనున్నారు.