NEET UG 2024 Revised Result : నీట్ యూజీ రివైజ్డ్ ఫలితాలు విడుదల.. స్కోర్ కార్డు ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి

By Mahesh Rajamoni  |  First Published Jul 25, 2024, 3:57 PM IST

NEET UG 2024 Revised Final Result: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) సవరించిన నీట్ యూజీ 2024 ఫలితాలను ప్రకటించింది. ఫిజిక్స్ ప్రశ్నకు ఎంపిక చేసిన విద్యార్థులకు ఇచ్చిన కాంపెన్సేటరీ మార్కులను వెనక్కి తీసుకోవాలని సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించిన తర్వాత ఫ‌లితాల‌ను స‌వ‌రించారు.
 


NEET UG 2024 Revised Final Result: సుప్రీంకోర్టు ఆదేశాల నేప‌థ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ( NTA ) నీట్ యూజీ 2024 రివైజ్డ్ స్కోర్‌కార్డ్ 2024 ని విడుదల చేసింది. అస్పష్టమైన ఫిజిక్స్ ప్రశ్న నేప‌థ్యంలో సుప్రీంకోర్టు అదేశాల మేర‌కు ఫ‌లితాల‌ను స‌వ‌రించి మ‌ళ్లీ విడుద‌ల చేశారు. దీని ఫలితంగా మెరిట్ జాబితా రీకాలిబ్రేషన్ జరిగింది. జూలై 23న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నీట్ యూజీ G 2024 స‌వరించిన తుది ఫలితం వచ్చే రెండు రోజుల్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే, జూన్ 4న ప్రకటించిన ఫలితాల్లో 67 మంది విద్యార్థులు టాప్ ర్యాంక్‌ను పొందిన‌ట్టు తెలిపారు. 

అయితే, విద్యార్థుల ఆందోళనల మధ్య సుప్రీం కోర్టు జోక్యంతో ఐఐటీ-ఢిల్లీ నిపుణుల కమిటీ ఆధారంగా , వివాదాస్పద ప్రశ్నకు ఒక సరైన ఎంపికను మాత్రమే ఆమోదించడం తప్పనిసరి చేసింది. నీట్ యూజీ సవరించిన స్కోర్‌కార్డ్ 2024లో ఈ సర్దుబాటు కార‌ణంగా ఇప్పుడు ఆమోదించబడిన సమాధానాన్ని ఎంచుకున్న దాదాపు 4.2 లక్షల మంది విద్యార్థుల స్కోర్ లు ప్రభావితమ‌య్యాయి. అలాగే, టాప్ స్కోరర్‌ల సంఖ్య కూడా గణనీయంగా తగ్గుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. 

Latest Videos

నీట్ యూజీ ఫైన‌ల్ రిజ‌ల్ట్ స్కోర్‌కార్డ్ 2024 ను ఇలా చెక్ చేసుకోండి.. 

ఎన్టీఏ అధికారిక‌ వెబ్‌సైట్ exams.nta.ac.in/NEET లాగిన్ అయి నీట్ యూజీ ఫైన‌ల్ రిజ‌ల్ట్ స్కోర్‌కార్డ్ 2024 ఫ‌లితాల‌ను తెలుసుకోవ‌చ్చు.  దీని కోసం మొదట https://exams.nta.ac.in/  వెళ్లాలి. త‌ర్వాత NEET కోసం ఉన్న లింక్ పై క్లిక్ చేయండి. త‌ర్వాత మీ లాగిన్ వివ‌రాలు న‌మోదుచేసి స‌బ్మిట్ కొడితే స్క్రీన్ పై తాజా ఫ‌లితాలు వ‌స్తాయి. చివ‌ర‌లో స్కోర్ కార్డు డౌన్ లోడ్ బ‌ట‌న్ క్లిక్ చేసి సేవ్ చేసుకోవ‌చ్చు. కౌన్సిలింగ్ స‌మ‌యంలో స్కోర్ కార్డును అంద‌చేయాల్సి ఉంటుంది. 

రోహిత్ శర్మ భారీ రికార్డును బద్దలుకొట్ట‌నున్న సూర్యకుమార్ యాదవ్

click me!