
ఇండియన్ కోస్ట్ గార్డ్ సిబ్బంది మానవత్వం చూపించారు. సిత్రాంగ్ తుఫాన్ ప్రభావం వల్ల బంగ్లాదేశ్ కు చెందిన ఓ బోటు బోల్తా పడింది. దీంతో అందులో ఉన్న మత్స్యకారులు నీటిలో పడిపోయారు. దీనిని గమనించిన కోస్ట్ గార్డ్ సిబ్బంది అప్రమత్తమై వారిని రక్షించింది. 20 మంది మత్స్యకారుల ప్రాణాలను రక్షించింది.
కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫొటో ఎందుకు వేయవద్దు?: కేజ్రీవాల్‌కు కాంగ్రెస్ కౌంటర్
వివరాలు ఇలా ఉన్నాయి. ఇండియన్ కోస్ట్ కార్డ్ కు చెందిన డోర్నియర్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇండో-బంగ్లాదేశ్ అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖకు సాధారణ పర్యవేక్షణ నిర్వహిస్తోంది. ఈ సమయంలో పశ్చిమ బెంగాల్ తీరానికి దగ్గరగా సాగర్ ద్వీపం సమీపంలో దాదాపు 90 మీటర్ల లోతున్న నీటిలో 20 మంది పడిపోవడం గమనించింది. తుఫాన్ వాతావరణం వల్ల వారు చేపల వేట కోసం ఉపయోగించిన బోటు బోల్తా పడి ఉంది. ఫిషింగ్ బోట్ పై, దాని శిథిలాలపై ఆధారపడుతూ పలువురు ప్రాణాలను రక్షించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో ఇండియన్ కోస్ట్ గార్డు సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ ను నిర్వహించారు. ఆ ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా మత్స్యకారులను రక్షించారు. ఈ విషయాన్ని ఇండియన్ కోస్ట్ గార్డు తెలిపింది.
పోలీస్ ఇన్‌ఫార్మర్ అనే నెపంతో జర్నలిస్టు సోదరుడిని కిడ్నాప్ చేసి, హత్య చేసిన మావోయిస్టులు..
ఈ ఆపరేషన్ తరువాత మలేషియాలోని పోర్ట్ క్లాంగ్ నుంచి కోల్ కతాకు వెళ్తున్న నంతా భూమ్ అనే వాణిజ్య నౌకలో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు ఎయిర్ క్రాఫ్ట్ లను మళ్లించారు. అలాగే ఐసీజీ నౌకలు అయిన విజయ, వరద్, ఫాస్ట్ ఇంటర్సెప్టర్ క్రాఫ్ట్ సీ -426 లను ఈ ప్రాంతంలో సెర్చ్, ఆపరేషన్ చర్యలు చేపట్టేందుకు ఉపయోగించారు. బంగ్లాదేశ్ మత్స్యకారులను ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా రక్షించిన తరువాత ఐసీజీ ఓడ విజయ ద్వారా వారిని ఒడ్డుకు చేర్చారు. కాగా.. తుఫాను సమయంలో ప్రభావితమైన మొత్తం ప్రాంతాన్ని పరిశీలించేందుకు ఐసీజీ మరో రెండు వైమానిక విమానాల సాయం తీసుకుంది.
కాగా.. బంగ్లాదేశ్ మత్స్యకారులను రక్షించిన తరువాత ఇండియన్ కోస్ట్ గార్ట్ షిప్ లో ఉన్న డాక్టర్ వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. బాధిత మత్స్యకారులను బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్‌కు అప్పగించాలని యోచిస్తున్నట్లు ఇండియన్ కోస్ట్ గార్డు ఓ ప్రకటనలో పేర్కొంది. రెండు కోస్ట్ గార్డ్స్ మధ్య ఈ విషయంలో ఇది వరకే ఒప్పందం కూడా కుదిరింది.