బాబ్రీ మసీదు కూల్చివేత: ఈ నెల 30న తుది తీర్పు, కోర్టుకు హాజరుకానున్న అద్వానీ

By Siva KodatiFirst Published Sep 16, 2020, 4:32 PM IST
Highlights

భారతదేశ రాజకీయ, సామాజిక ముఖచిత్రాన్ని మార్చివేసిన బాబ్రీ మసీదు కూల్చివేత కేసుపై ఈనెల 30న తీర్పు వెలువడనుంది. ఈ కేసును విచారిస్తున్న సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి ఎస్‌కే యాదవ్ తీర్పును వెలురించనున్నారు. 

దీనిలో భాగంగా నిందితులంతా తీర్పు రోజు కోర్టుకు హాజరుకావాలని  ఆయన ఆదేశించారు. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బీజేపీ అగ్రనేతలు ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్ జోషీ, ఉమా భారతి, యూపీ మాజీ సీఎం కళ్యాణ్ సింగ్, వినయ్ ఖతియార్ సహా మొత్తం 32 మంది ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

1992లో బాబ్రీ మసీదు ధ్వంసానికి దారితీసేలా కుట్రపూరితంగా వ్యవహరించారని బీజేపీ దిగ్గజ నేతలపై ఆరోపణలున్నాయి. అయితే మూడు దశాబ్ధాల నాటి ఈ కేసులో విచారణ పూర్తి చేసి రెండేళ్లలో తీర్పు వెలువరించాలని 2017లో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.

1992, డిసెంబ‌ర్ 6వ తేదీన అయోధ్య‌లో క‌ర సేవ‌కులు 16వ శ‌తాబ్ధానికి చెందిన మ‌సీదును ధ్వంసం చేసిన విష‌యం తెలిసిందే. 

click me!