రాజస్థాన్‌ చంబల్ నదిలో బోటు మునక: నలుగురి మృతి, 10 మంది గల్లంతు

By narsimha lodeFirst Published Sep 16, 2020, 11:02 AM IST
Highlights

రాజస్థాన్ రాష్ట్రంలోని కోటా జిల్లాలోని చంబల్ నదిలో బోటు మునిగిన ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరో 10 మంది గల్లంతయ్యారు. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు.


జైపూర్: రాజస్థాన్ రాష్ట్రంలోని కోటా జిల్లాలోని చంబల్ నదిలో బోటు మునిగిన ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరో 10 మంది గల్లంతయ్యారు. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు.

నదిలో బోటు మునిగిన సమయంలో ఈ బోటులో సుమారు 50 మంది ప్రయాణం చేస్తున్నారు. 10 మంది గల్లంతయ్యారని ప్రత్యక్షసాక్షులు తెలిపారుఇవాళ ఉదయం కతౌలీ ఏరియాలోని గోతా గ్రామసమీపంలో ఈ బోటు చంబల్ నదిలో మునిగిపోయింది. ఈ ఘటన జరిగిన ప్రాంతం కోటా జిల్లా సరిహద్దులో ఉంటుంది. 

గోతం కాలా సమీపంలోని కమలేశ్వర్ ధామ్ కు 50 మంది  ప్రయాణిస్తున్న సమయంలో చంబల్  నదిలో  బోటు మునిగిపోయింది. బోటు మునిగిన తర్వాత 20 మందిని స్థానికులు సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

బోటు మునిగిన ప్రాంతానికి అంబులెన్స్ లను తరలించారు. ప్రమాదం నుండి బయటపడినవారికి ప్రమాదస్థలంలోనే చికిత్స అందిస్తున్నారు. బోటు ప్రమాదంలో గల్లంతైన వారి కోసం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

click me!