Ayodhya Verdict: 5గురు ఐఎఎస్ ల బదిలీ, అయోధ్య కమిషనర్ గా ఆయన

By telugu teamFirst Published Nov 9, 2019, 1:05 PM IST
Highlights

ఆయోధ్య తీర్పు నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఐదుగురు ఐఎఎస్ అధికారులను బదిలీ చేసింది. అయోధ్య సర్కిల్ కమిషనర్ గా మహేంద్ర ప్రసాద్ అగర్వాల్ ను నియమించింది.

లక్నో: అయోధ్య తీర్పు నేపథ్యంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఐదుగురు ఐఎఎస్ అధికారులను బదిలీ చేసింది. వారిలో ఒకరిని అయోధ్య కమిషనర్ గా నియమించింది. 

మౌలిక సదుపాయాలు, పారిశ్రామికాభివృద్ధి శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న మహేంద్ర ప్రసాద్ అగర్వాల్ ను అయోధ్య సర్కిల్ ఆపీసరుగా నియమించింది. ఆయన అయోధ్య సర్కిల్ కమిషనర్ గా పనిచేస్తారని ప్రభుత్వ ఉత్తర్వులో తెలియజేశారు. 

Also Read: Ayodhya verdict: తీర్పు ఏకగ్రీవం , తుది తీర్పు ముఖ్యాంశాలు ఇవే

అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు శనివారం తుది తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. అయోధ్య వివాదానికి సంబంధించి ముస్లింలకు ప్రత్యామ్నాయ స్థలాన్ని చూపాలని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. అయోధ్యలోనే మసీదు నిర్మాణానికి ప్రత్యామ్నాయ స్థలాన్ని ఐదు ఎకరాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

1993లో ప్రభుత్వం సేకరించిన స్థలంలో అయినా సున్నీ బోర్డుకు స్థలాన్ని ఇవ్వొచ్చని కూడ సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అయోధ్యలోనే మసీదు నిర్మాణానికి ప్రత్యామ్నాయ స్థలాన్ని ఇవ్వాలని సుప్రీంకోర్టు తన తీర్పులో  వెల్లడించింది.

Also Read: Ayodhya verdict: రామ మందిర నిర్మాణానికి లైన్ క్లియర్

అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి లైన్ క్లియర్ అయినట్టుగా భావిస్తున్నారు.అయోధ్య యాక్ట్ కింద మూడు నెలల్లో మందిర నిర్మాణానికి ట్రస్ట్ ఏర్పాటు చేశారు. ఆలయ నిర్మాణం, నిర్వహణ పనులను ట్రస్ట్ నిర్వహించాలని కూడ సుప్రీంకోర్టు తెలియజేసింది.

మూడు నెలల్లోపుగా కేంద్రం  అయోధ్య ట్రస్ట్‌ను ఏర్పాటు చేయాలని కూడ సుప్రీం కోర్టు ఆదేశించింది.గతంలో అలహాబాద్ కోర్టు ముగ్గురు సమానంగా వివాదస్థలాన్ని పంచుకోవాలని తీర్పు ఇచ్చింది.అయితే ఈ తీర్పును సుప్రీం కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది.

click me!