అయోధ్యకు హైదరాబాద్ నుంచి 1,265 కిలోల లడ్డూలు, యూపీనుంచి వెయ్యి కిలోల బెల్లం...

By SumaBala Bukka  |  First Published Jan 18, 2024, 1:18 PM IST

ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాకు చెందిన సత్య ప్రకాష్ రేషు రామమందిరం ప్రాణ ప్రతిష్ట వేడుకకు 1,000 కిలోల బెల్లం కానుకగా పంపారు. ఇది ప్రసాదం తయారీలో వినియోగిస్తారు.


ఉత్తర్ ప్రదేశ్ : జనవరి 22న అయోధ్యలో రామాలయం ప్రారంభం, ప్రాణప్రతిష్ట పవిత్రోత్సవం జరగనుంది. ఇందుకోసం ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాకు చెందిన సత్య ప్రకాష్ రేషు ప్రసాదం తయారు చేసేందుకు వెయ్యి కిలోల బెల్లం పంపించారు.

సత్య ప్రకాష్ మంగళవారం నాడు అయోధ్యకు 1,000 కిలోల బెల్లం పంపారు. త్వరలో మరో 101 క్వింటాళ్ల బెల్లం పంపిస్తామన్నారు. అయోధ్యలో రామమందిరం ప్రాణ ప్రతిష్ఠ సమయంలో ప్రసాదంగా బెల్లం పంపిణీ చేయనున్నారు. ఆలయ నగరం అయోధ్యలో ఉన్న భక్తులకు ఇది పంపిణీ చేయబడుతుంది.

Latest Videos

undefined

సత్యప్రకాష్ మాట్లాడుతూ ఏ శుభకార్యం జరగాలన్నా ముందుగా పూజలో బెల్లం వినియోగించడం మన సంప్రదాయమని అన్నారు. ఇది ప్రసాదంగా పంపిణీ చేయబడుతుంది. బెల్లం ఖీర్, టీ, పాలు, హల్వా తయారీలో ఉపయోగిస్తారు.

అయోధ్యలో ప్రాణప్రతిష్ట నాడు రాముడికి పెట్టాల్సిన 5 రకాల నైవేద్యాలు ఇవే..

మరోవైపు, రామమందిరం కోసం నాగభూషణ్ రెడ్డి అనే వ్యక్తి 1,265 కిలోల లడ్డూను తయారు చేశారు. హైదరాబాద్‌కు చెందిన నాగభూషణ్ రెడ్డి రామ మందిరం కోసం 1,265 కిలోల లడ్డూను తయారు చేశారు. ఇది ఆలయానికి సమర్పిస్తారు. బుధవారం హైదరాబాద్ నుంచి అయోధ్యకు లడ్డూను పంపించారు. లడ్డూలు పంపుతున్న సందర్భంగా నాగభూషణ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. 2000 సంవత్సరం నుంచి శ్రీరామ్ క్యాటరింగ్ అనే క్యాటరింగ్ సర్వీస్ నడుపుతున్నాను.. రామమందిరం భూమి పూజ జరుగుతున్నప్పుడు శ్రీరాముడికి ఏం ప్రసాదం ఇవ్వొచ్చని అనుకున్నా.

నాగభూషణ్‌రెడ్డి మాట్లాడుతూ.. భూమిపూజ జరిగిన రోజు నుంచి ఆలయ ప్రారంభోత్సవం వరకు ప్రతిరోజూ కిలో లడ్డూ చొప్పున ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. ఈ విధంగా ఆలయానికి 1,265 కిలోల లడ్డూలను సిద్ధం చేశాం. ఈ లడ్డూను ఫ్రిజ్‌లో ఉంచి హైదరాబాద్‌ నుంచి అయోధ్యకు తీసుకెళ్తున్నాం. లడ్డూలను తయారు చేసేందుకు 30 మంది 24 గంటల పాటు శ్రమించారు. లడ్డూలు తయారు చేయడానికి మాకు 4 గంటలు పట్టింది’ అని చెప్పారు.

click me!