అయోధ్య రామాలయ ప్రారంభోత్సవ ఆహ్వానపత్రిక ఎంతో విశిష్టంగా తయారు చేశారు. ఇందులో అనేక సమాచారంతో పాటు.. ఆసక్తికరమైన అంశాలు ఎన్నో ఉన్నాయి.
అయోధ్య : జనవరి 22న జరగనున్న రామాలయ ప్రతిష్ఠాపన వేడుక కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రత్యేక ఆహ్వాన పత్రం ఆవిష్కరించబడింది. ఈ ఆహ్వానపత్రంలో రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని 495 సంవత్సరాల తర్వాత జరిగే అద్భుతంగా పేర్కొన్నారు. జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే ఇలాంటి వేడుకకు హాజరయ్యే అవకాశం వస్తుందని అభివర్ణించారు. దీనికోసం ఎంపిక చేసిన వీవీఐపీలకు ఈ ఆహ్వానపత్రం పంపుతారు. చక్కగా రూపొందించిన డాకెట్‌లో అందంగా అలంకరించబడిన పేపర్ షీట్‌లు, బుక్‌లెట్‌లు, శ్రీరాముడి చిత్రపటం ఉంటాయి.
ఈ ఆహ్వాన పత్రంలో రామ మందిరం అద్భుత వర్ణనతో పాటు, డాకెట్‌లో ఆలయ ఉద్యమం సంక్షిప్త చరిత్ర, పాల్గొన్న ముఖ్య వ్యక్తుల వివరాలు ఉన్నాయి. ఆలయ నిర్మాణంలో విశ్వహిందూ పరిషత్ పాత్ర కూడా హైలైట్ చేశారు. మధ్యాహ్నం 12.20 గంటలకు ప్రారంభమయ్యే కార్యక్రమానికి ఆహ్వానం అందినవారందరూ ఉదయం 11 గంటల వరకే చేరుకోవాలని తెలిపారు.
దీంట్లో శ్రీరాముడు తన సొంతింటికి తిరిగి వస్తున్నాడు.. అంటూ ఈ వేడుకకు పేరు పెట్టారు. ఈ పవిత్రమైన వేడుక ట్రస్ట్ ప్రోగ్రామ్, ఈవెంట్ ఏర్పాట్ల గురించి సమగ్ర వివరాలను అందిస్తోంది. అలా ఈ ఆహ్వానపత్రం "అసాధారణమైన ఆహ్వానం"గా వివరించబడింది.
అయోధ్య : రామాలయ నిర్మాణంలో మొదటినుంచీ ఎన్నో సవాళ్లు.. పునాదులు వేయడం ఇంత కష్టమైందా?
డాకెట్ బ్యాక్‌డ్రాప్ రామ మందిరం అద్భుతమైన చిత్రాన్ని ప్రదర్శిస్తుంది, రామాలయ చిహ్నాలు, బంగారు చక్రాలు పవిత్ర క్షణాలను, రాముడి రాజరికాన్ని సూచిస్తాయి. మధ్యాహ్నం 12.20 గంటల 'ముహూర్తం' పౌష్ శుక్ల ద్వాదశితో సమానంగా ఉంటుందని ట్రస్ట్ వెల్లడించింది, ఈ ముహూర్తం విష్ణువును పూజించడానికి పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది.
పవిత్ర వేడుకలో, ఐదుగురు ప్రముఖులు - నరేంద్ర మోడీ, మోహన్ భగవత్, ఆనందీ బెన్ పటేల్, యోగి ఆదిత్యనాథ్, నృత్య గోపాల్ దాస్ లు - సాధువులు, జ్ఞానుల మార్గదర్శకత్వంలో 'గర్భాలయం'లో ఉంటారు. ఈ బృందం ఉదయం 11.30 గంటలకు ఆలయంలోని గర్భాలయాన్ని చేరుకోవాలి. దీని తరువాత మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రధాని మోదీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
రామాలయ ప్రారంభోత్సవానికి వచ్చిన మిగతా సాధువులు, ప్రముఖులు వేడుక ముగిసిన తర్వాత ఆలయ సముదాయంలో ప్రత్యక్ష ప్రదర్శనతో ‘దర్శనం’ చేసుకునే అవకాశం ఉంటుంది. ‘మెమాయిర్ ఆఫ్ హానర్’ పేరుతో మరో బుక్‌లెట్ అతిథులకు ఇస్తారు. ఇందులో రామమందిర నిర్మాణ ప్రయాణంలో కృషి చేసిన కీలకమైన వ్యక్తుల గురించి సమాచారం ఉంటుంది.
ఈ బుక్‌లెట్‌కు 'వర్డ్స్ అండ్ యాక్షన్స్ దట్ నావిగేటెడ్ ద కోర్స్’ అని నామకరణం చేశారు. ఇందులో ఓంకార్ భావే, మహంత్ వైద్యనాథ్, దేవకినందన్ అగర్వాల్, శివహార్య మహరాజ్, బాలాసహెద్ దేవరాస్, విజయ రాజే సింధియా, ఆచార్య గిరిరాజ్ కిషోర్, స్వామి సత్యమిత్రానంద గిరి, విష్ణు హరి దాల్మియా, స్వామి వామ్‌దేవ్ మహారాజ్ లాంటి వంటి వ్యక్తుల ఫోటోలు సంక్షిప్త వివరణలు ఉన్నాయి.