నేడు తుది కక్ష్యలోకి :అందరి చూపు ఆదిత్య ఎల్-1పైనే

By narsimha lodeFirst Published Jan 6, 2024, 10:41 AM IST
Highlights

ఆదిత్య ఎల్  1పైనే అందరి దృష్టి ఉంది.  భారత అంతరిక్ష పరిశోధన సంస్థ  ప్రయోగించిన  ఆదిత్య ఎల్  1 ను  ఇవాళ ఇస్రో  చివరి కక్ష్యలోకి ప్రవేశ పెట్టనుంది.

న్యూఢిల్లీ:అందరి చూపు ఆదిత్య ఎల్ 1 పైనే ఉంది.  శనివారం నాడు సాయంత్రం నాలుగు గంటలకు  భారత  అంతరిక్ష పరిశోధన సంస్థ  ఇస్రో  ఆదిత్య ఎల్ -1 ను చివరి కక్ష్యలోకి ప్రవేశ పెట్టనుంది.  

ఆదిత్య  ఎల్ -1 వ్యోమనౌకను   నిర్ధేశించిన లాంగ్రాంజ్ పాయింట్ చుట్టూ  ఉన్న హాలో కక్ష్యలో నాలుగు గంటలకు  ఇస్రో ప్రవేశ పెట్టనుంది.

సూర్యుడికి సంబంధించిన సమాచారాన్ని  భూమికి చేరవేయనుంది.

2023  సెప్టెంబర్  రెండో తేదీన  ఆదిత్య ఎల్ -1ను శ్రీహరికోటలోని  సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి  ప్రయోగించారు.  పలు దఫాలుగా  ఆదిత్య ఎల్-1 కక్ష్యలను  పెంచారు. దీంతో  ఆదిత్య ఎల్-1 వ్యోమ నౌక లాగ్రాంజ్ పాయింట్  చుట్టూ ఉన్న హాలో కక్ష్యలో  ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు  ఇస్రో ప్రవేశ పెట్టనుంది.  ఇవాళ సాయంత్రం  నాలుగు గంటలకు  ఇస్రో  హాలో కక్ష్యలోకి ఆదిత్య  ఎల్ -1 ను ప్రవేశ పెట్టకపోతే  అది నియంత్రణ కోల్పోయి సూర్యుడి వైపు వెళ్లే అవకాశం ఉందని  శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

లాగ్రాంజ్ పాయింట్లకు  ఫ్రెంచ్ గణిత  శాస్త్రవేత్త  జోసెఫ్ లూయిస్ లాగ్రాంజ్ పేరు పెట్టారు.  అమెరికా తర్వాత  అంతరిక్షంలోకి ఈ తరహాలో వ్యోమ నౌకను పంపిన రెండో దేశం భారత్.  సోలార్ అండ్ హీలియో‌స్పిరిక్ అబ్జర్వేటరీ మిషన్ ద్వారా నాసా యూరోపియన్  స్పేస్  ఏజెన్సీ మధ్య ప్రోబ్ మాత్రమే  జరిగింది.

భూమి నుండి  15 లక్షల కి.మీ. దూరంలో లాగ్రాంజ్ పాయింట్ ఉంది. ఈ పాయింట్ లో గ్రహణలు జరగవు. అక్కడి నుండి సూర్యుడిని నిరంతరం వ్యోమ నౌక పరీక్షిస్తుంది.ఫోటోస్పియర్, క్రోమోస్పియర్, కొరోనామ అధ్యయనం చేయనుంది వ్యోమనౌక.

స్పేస్ లోని శాటిలైట్లు సౌర తుఫాన్ కు గురౌతాయి. దీంతో సమాచార వ్యవస్థకు నష్టం జరుగుతుంది. సౌర తుఫాన్ కు సంబంధించి ముందే హెచ్చరికలు  చేసేలా  ఆదిత్య  ఎల్-1 సమాచారం ఇచ్చేలా  శాస్త్రవేత్తలు ప్లాన్ చేశారు.

click me!