జనవరి 22న జరగనున్న అయోధ్య మహోత్సవానికి ఎంట్రీపాసులు శుక్రవారం విడుదలయ్యాయి.
అయోధ్య : యేళ్లుగా ఎదురుచూస్తున్న అపురూపఘట్టానికి సమయం దగ్గరపడుతోంది. ఇంకా కొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉంది. ఈ క్రమంలోనే అయోధ్య రామాలయం ప్రారంభోత్సవ వేడుకకు ఆహ్వానితులకు ఎంట్రీపాసులు, క్యూఆర్ కోడ్ లు శుక్రవారం నాడు విడుదలయ్యాయి. శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు శుక్రవారం అధికారికంగా వీటిని విడుదల చేసింది.
జనవరి 22వ తేదీన ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి ఆహ్వానించబడిన విశిష్టఅతిథులందరికీ వారి పేరుతో ఈ పాసులు అందిస్తారు. ఎంట్రీ పాసుల మీద ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన తరువాత లోపలికి అనుమతిస్తామని అతిథులకు ఇప్పటికే సమాచారం అందించారు. భద్రతాచర్యల్లో భాగంగా ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లుగా తెలిపారు.
undefined
ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి దాదాపు 7వేలమంది ఆహ్వానితులు ఉన్నారు. విశిష్ట అతిథులతో పాటు 150కి పైగా సంప్రదాయాలకు చెందిన సాధువులు, మహామండలేశ్వర్, మండలేశ్వర్, శ్రీమహంత్, మహంత్ వంటి అన్ని పాఠశాలల ఆచార్యులు కూడా హాజరుకానున్నారు.
అయోధ్య : సీతమ్మ తల్లికి బంగారు చీర.. సిరిసిల్ల చేనేత కారుడి అపురూప కానుక...
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సగం రోజు హాలిడే ప్రకటించింది. తద్వారా అందరూ ఈ ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనే అవకాశాన్ని కల్పించింది.
ఆరు జిల్లాలనుంచి అయోధ్యకు హెలికాప్టర్ సర్వీసులను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించబోతోంది. ఈ జిల్లాల్లో గోరఖ్ పూర్, వారణాసి, లక్నో, ప్రయాగ్ రాజ్, మథుర, ఆగ్రాలనుంచి నడవనున్నాయి.