అయోధ్య తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు అయోధ్య ఆహ్వానం అందింది. జనవరి 22న నిర్వహిస్తున్న ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరు కావాలని ఐదుగురు న్యాయమూర్తులకు ఆహ్వానం అందింది.
Supreme Court: ఈ నెల 22వ తేదీన అయోధ్యలో నిర్మితం అవుతున్న రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమం కోసం దేశంలో పలు రంగాలకు చెందిన ప్రముఖులను ట్రస్ట్ ఆహ్వానించింది. ఇందులో భాగంగా అయోధ్య తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులనూ ఆహ్వానించింది.
నాలుగేళ్ల క్రితం సుప్రీంకోర్టు రామ జన్మభూమి-బాబ్రీ మసీదు కేసు విషయంలో తీర్పు వెలువరించింది. ఐదుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. వివాదాస్పద స్థలంలో రామ మందిరాన్ని ఒక ట్రస్టుతో నిర్మాణం చేయించాలని, అలాగే, అయోధ్యలోనే మసీదు నిర్మించుకోవడానికి వేరే స్థలం కేటాయించాలని ఆదేశించింది. ఆ తీర్పు వెలువరించే సమయంలో దేశ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రంజన్ గొగోయ్ ఉన్నారు.
Also Read : Richest Family: ప్రపంచంలోనే ధనిక కుటుంబం ఆస్తులు.. 700 కార్లు, 8 జెట్ ఫ్లైట్లు, రూ. 4 వేల కోట్ల ప్యాలెస్
రంజన్ గొగోయ్ సహా మాజీ సీజేఐ ఎస్ఎ బాబ్డే, ప్రస్తుతం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు అశోక్ భూషణ్, ఎస్ అబ్దుల్ నజీర్‌లు ఆ ఐదుగురు సభ్యుల రాజ్యధర్మాసంలో ఉన్నారు. ఈ న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనమే 2019లో అయోధ్య తీర్పు వెలువరించింది. ఆ తర్వాతే అయోధ్యలో రామ మందిర నిర్మాణం ప్రాంభమైంది.