అయోధ్యలో దీపోత్సవం 2024 సందర్భంగా 1100 మంది వేదాచార్యులు సరయు నది తీరాలో సామూహిక ఆరతి నిర్వహించారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ కార్యక్రమంలో పాల్గొని సరయు నదికి పూజలు చేశారు. ఈ అరుదైన ఘట్టం గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది.
అయోధ్య : ఆ బాలరాముడు కొలువైన తర్వాత అయోధ్యలో జరుగుతున్న మొదటి దీపోత్సవ వేడుకలు అట్టహాసంగా జరుగుతోంది. ఈ సందర్భంగా యోగి ప్రభుత్వం అరుదైన రికార్డు సాధించింది. 1100 మంది వేదాచార్యులు ఏకకాలంలో సరయు నదీతీరంలో నిలబడి ఆ పవిత్ర నీటికి హారతి ఇచ్చారు. స్వయంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా సరయు నది ఒడ్డున ఏర్పాటు చేసిన వేదికపైనుండి హారతి ఇచ్చారు. ఒకే రంగు వస్త్రాలు ధరించిన వేదాచార్యులు ఏక స్వరంతో మంత్రోచ్చరణ చేస్తూ ఈ హారతి చేశారు. ఈ కార్యక్రమం ఒకవైపు ఆధ్యాత్మికతను చాటిస్తే, మరోవైపు యోగి ప్రభుత్వ ప్రతిష్టను మరింతగా పెంచింది. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కూడా ఈ ఘనతను ధృవీకరించింది.
హరతికి ముందు ముఖ్యమంత్రి సరయు నదిలోని జలాలకు పూజలు నిర్వహించారు. అట్టహాసంగా జరిగిన ఈ దీపోత్సవ వేడుకలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ తదితరులు పాల్గొన్నారు.
undefined
సరయు హారతి ఫోటోలు :