ఉత్తరప్రదేశ్‌లో 29 లక్షలకు పైగా నిరాశ్రిత మహిళలకు దీపావళి పండుగకు ముందు ఫించన్ డబ్బులు అందించారు. దీంతో ఆ మహిళల ఇంటిలో వెలుగులు నిండాయి.
అసహాయులైన ఒంటరి మహిళలకు యోగి సర్కార్ అండగా నిలిచింది. జీవనం భారమైన వారికి నిరాశ్రయ మహిళా ఫించను అందించి ఆర్థికంగా అండగా నిలిచారు. తాజాగా దీపావళి పండగ వేళ ఈ ఒంటరి మహిళల ఇంట వెలుగులు నింపారు. ఉత్తరప్రదేశ్‌లో 29 లక్షలకు పైగా నిరాశ్రిత మహిళలకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు దీపావళికి ముందు మూడవ విడత పింఛను అందజేసారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వితంతువులకు సహాయం చేయడానికి ఉద్దేశించిన నిరాశ్రిత మహిళా పింఛను యోజన కింద నిధులను బదిలీ చేశారు.
18 ఏళ్లు పైబడిన పేద వితంతువులకు నిరాశ్రిత ఫించన్లు అందిస్తోంది. కుటుంబ వార్షిక ఆదాయం రూ.2 లక్షలలోపు ఉండి భర్తను కోల్పోయిన మహిళలు ఈ ఫించనుకు అర్హులు. ఈ పించను లబ్ధిదారులు ఏ ఇతర రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వ పింఛను పథకంలో నమోదు చేసుకోకూడదు. ప్రత్యామ్నాయ ఆర్థిక మద్దతు లేని పేద మహిళలకు ఈ సహాయం చాలా ముఖ్యం.
undefined
ఈ సంవత్సరం యోగి ప్రభుత్వం మూడు త్రైమాసిక విడతలలో పింఛను పంపిణీని విజయవంతంగా నిర్వహించింది. మొదటి త్రైమాసికంలో 26.12 లక్షల మంది లబ్ధిదారులకు రూ. 78,838.54 లక్షలు కేటాయించగా, రెండవ త్రైమాసికంలో 28.47 లక్షల మంది లబ్ధిదారులకు రూ. 91,517.75 లక్షలు కేటాయించారు. మూడవ విడత రూ.90,176.91 లక్షలు సరిగ్గా పండక్కి ముందు 29.03 లక్షల మంది లబ్ధిదారులకు చేరింది.
అర్హత కలిగిన ప్రతి మహిళకు ప్రయోజనాలు అందేలా చూడాలని ముఖ్యమంత్రి యోగి అధికారులను ఆదేశించారు. ఈ సాయం ద్వారా దీపావళి పండుగపూట మహిళల ఇంట్లో వెలుగులు నింపారు. రాష్ట్రంలోని అత్యంత నిరుపేద కుటుంబాలను ఆదుకోవడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని దీని ద్వారా చూపించారు.
ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ, పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (PFMS) ఏకీకరణతో పింఛను పంపిణీ మరింత సమర్థవంతంగా మారింది. లబ్ధిదారుల ఖాతాలకు సకాలంలో బదిలీలు జరిగేలా చూస్తుంది. ఉత్తరప్రదేశ్‌లోని మహిళలకు ఆర్థిక భద్రత, గౌరవాన్ని అందించే లక్ష్యంతో యోగి ప్రభుత్వం ఈ చొరవ తీసుకుంది. దీని ద్వారా సామాజిక బాధ్యత పట్ల తమకున్న అంకితభావాన్ని యోగి సర్కార్ ప్రదర్శించింది.