అయోధ్య బాటలోనే ప్రయాగరాజ్‌లో దీపోత్సవ వేడుకలు ...వెలిగిపోయిన గంగా తీరం

By Arun Kumar P  |  First Published Oct 30, 2024, 8:41 PM IST

అయోధ్య తరహాలోనే ప్రయాగరాజ్‌లో కూడా దీపోత్సవం ఘనంగా జరిగింది. సంగమం, యమునా తీరాలు వేలాది దీపాలతో వెలిగిపోయాయి. గంగా హారతి కూడా నిర్వహించారు. దేవ్ దీపావళికి మరింత ఘనంగా వేడుకలు జరగనున్నాయి.


ప్రయాగరాజ్ : అయోధ్యలో శ్రీరామ మందిరం ప్రతిష్టాపన తర్వాత ఈ సంవత్సరం తొలి దీపోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. సీఎం యోగి సర్కార్ సహకారంతో అయోధ్య వాసులు ఈ ఏడాది రెండున్నర కోట్ల దీపాలను వెలిగించి కొత్త గిన్నిస్ బుక్ రికార్డు సృష్టించారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ గిన్నిస్ రికార్డును అందుకున్నారు. 

అయోధ్యవాసుల ఉత్సాహాన్ని చూసి ప్రేరణ పొందిన సంగమనగరి ప్రయాగరాజ్‌లో కూడా దీపోత్సవ వేడుకలు జరిగాయి. ప్రయాగరాజ్‌లోని సంగమం, యమునా నది ఒడ్డున ఉన్న బలువా ఘాట్‌లో దీపోత్సవ వేడుకలు జరిగాయి. వందల సంఖ్యలో ప్రయాగరాజ్ వాసులు తరలివచ్చి గంగా, యమునా హారతి ఇచ్చి దీపాలను వెలిగించి సంగమ తీరాన్ని వెలుగులతో నింపారు.

గంగమ్మ తల్లికి జేజేలు

Latest Videos

undefined

దీపావళికి ముందు దీపోత్సవం సందర్భంగా బుధవారం ప్రయాగరాజ్ వాసులు సంగమ తీరాన గుమిగూడి గంగా హారతి ఇచ్చి దీపాలను వెలిగించారు. వందల సంఖ్యలో ప్రజలు శ్రీరాముడు, గంగమ్మ, సనాతన ధర్మం జై అంటూ నినదించారు. అదేవిధంగా యమునా నది ఒడ్డున ఉన్న బలువా ఘాట్‌లో యమునా హారతి సమితి సభ్యులతో కలిసి వందలాది మంది దీపదానం చేసి ఘాట్‌లపై దీపాలను వెలిగించి దీపోత్సవ వేడుకలు జరుపుకున్నారు. అంతేకాకుండా ప్రయాగరాజ్‌లోని ఆలయాల్లో చిన్న దీపావళి, హనుమాన్ జయంతి వేడుకలు కూడా దీపాలను వెలిగించి జరుపుకున్నారు.

దేవ్ దీపావళికి మరింత ఘనంగా వేడుకలు

సాధారణంగా ప్రయాగరాజ్‌లో దేవ్ దీపావళి వేడుకలు జరుపుకుంటారు. కానీ సీఎం యోగి చొరవతో అయోధ్యలో జరిగిన చారిత్రాత్మక దీపోత్సవ వేడుకల నుంచి ప్రేరణ పొంది రాష్ట్రవ్యాప్తంగా గంగా, యమునా నదుల తీరాల్లో ప్రజలు స్వచ్ఛందంగా దీపోత్సవ వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రయాగరాజ్‌లో కూడా ప్రజలు పెద్ద ఎత్తున దీపాలను వెలిగించి గంగా హారతి, దీపదానంలో పాల్గొన్నారు.

దేవ్ దీపావళికి కూడా ఇక్కడ ఘనంగా వేడుకలు జరుపుతారు. ఈ వేడుకలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి ఎందుకంటే రెండు నెలల తర్వాత ప్రయాగరాజ్ ప్రపంచంలోనే అతిపెద్ద కార్యక్రమం అయిన మహా కుంభమేళాకు వేదిక కానుంది. ఈ సంగమ తీరాన లక్షలాది, కోట్లాది మంది భక్తులు తరలివస్తారు. దీపోత్సవంలాగే ఇది కూడా చాలా రికార్డులను సృష్టించనుంది.

click me!