పండుగల సీజన్ మొదలవుతోంది... జనంలోకి వెళ్లొద్దు: రాష్ట్ర ప్రజలకు ఉద్ధవ్ థాక్రే హెచ్చరిక

By Siva KodatiFirst Published Sep 5, 2021, 5:04 PM IST
Highlights

పండుగ సీజన్ మొదలుకానుండటంతో పాటు రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతుండటంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే రాష్ట్ర ప్రజలను అప్రమత్తం చేశారు. ఒకేచోట జనం గుమిగూడవద్దని, జనంలోకి వెళ్లవద్దని, వ్యాక్సినేషన్ వేయించుకున్నప్పటికీ మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాలని థాక్రే హెచ్చరించారు

త్వరలో పండుగ సీజన్ మొదలుకానుండటంతో పాటు రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతుండటంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే రాష్ట్ర ప్రజలను అప్రమత్తం చేశారు. థర్డ్ వేవ్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతున్న తరుణంలో ఏ ఒక్కరూ నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని ఆయన సూచించారు. అందరూ అప్రమత్తంగా ఉండాలని సీఎం అన్నారు. గత ఏడాది ఫెస్టివల్ సీజన్ తర్వాత కోవిడ్ కేసులు అనూహ్యంగా పెరిగాయని ఆయన గుర్తు చేశారు.

ఆ దృష్ట్యా ఒకేచోట జనం గుమిగూడవద్దని, జనంలోకి వెళ్లవద్దని, వ్యాక్సినేషన్ వేయించుకున్నప్పటికీ మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాలని ఉద్ధవ్ థాక్రే హెచ్చరించారు. డాక్టర్స్ కాన్ఫరెన్స్‌ను ఉద్దేశించి  ఆదివారం జరిపిన వర్చువల్ మీటింగ్‌లో ముఖ్యమంత్రి ఈ హెచ్చరికలు చేశారు. ఆరోగ్య మౌలిక వసతులను ప్రభుత్వం పటిష్టం చేసిందని, థర్డ్ వేవ్ అవకాశాల దృష్ట్యా ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఆక్సిజన్ సామర్థ్యాన్ని 1200 ఎంటీల నుంచి 3,000 ఎంటీలకు పెంచామని చెప్పామని ఉద్ధవ్ థాక్రే అన్నారు. 

click me!