న్యూఢిల్లీలో కలకలం: పట్టపగలే తుపాకీ చూపి దోపిడి

Published : Sep 05, 2021, 05:03 PM IST
న్యూఢిల్లీలో కలకలం: పట్టపగలే తుపాకీ చూపి దోపిడి

సారాంశం

ఢిల్లీలోని హర్డ్‌వేర్ దుకాణంలో  పట్టపగలే  తుపాకీతో  బెదిరించి నగదును దోచుకొన్నారు. ముగ్గురు నిందితులు ఈ దోపీడికి పాల్పడినట్టుగా పోలీసులు గుర్తించారు. దుకాణంలోని సీసీటీవి పుటేజీ ఆధారంగా నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

న్యూఢిల్లీ: తుపాకీ చూపి హర్డ్‌వేర్ దుకాణంలో దోపీడికి పాల్పడ్డారు దుండగులు. దుకాణంలోని సీసీటీవీ పుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ముఖానికి ముసుగులు, హెల్మెట్లు ధరించిన వ్యక్తులు హర్డ్‌వేర్ దుకాణంలోకి వెళ్లిన దుండగులు దోపీడికి పాల్పడ్డారు. 

ఢిల్లీలోని బేరాఖర్ ప్రాంతంలో ఉన్న హర్డ్‌వేర్ దుకాణంలో శనివారం నాడు మధ్యాహ్నం దుండగులు ప్రవేశించి యజమానిని తుపాకీతో బెదిరించి లాకర్ లో ఉన్న నగదును దోచుకొన్నారు. తుపాకీతో బెదిరించి  క్షణాల్లోనే నిందితులుదుకాణం నుండి పారిపోయారు.

దుకాణంలోని సీసీటీవీ పుటేజీ  ఆధారంగా పోలీసులు  నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ దోపీడీలో ముగ్గురు నిందితులు పాల్పడినట్టుగా పోలీసులు గుర్తించారు. దోపీడీ సమయంలో నిందితులు తుపాకీని పేల్చినట్టుగా పోలీసులు చెప్పారు. దోపీడికి పాల్పడిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

పాత నేరస్తులే ఈ దోపీడికి పాల్పడి ఉంటారని  పోలీసులు అనుమానిస్తున్నారు. పాత నేరస్తుల గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. నిందితులు దోపీడికి పాాల్పడిన తర్వాత ఎక్కడికి వెళ్లారనే విషయమై ఈ ప్రాంతంలోని సీసీటీవీ పుటేజీ  ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 


 

PREV
click me!

Recommended Stories

PM Narendra Modi: మసాలా చాట్ టేస్ట్ చేసి పిల్లలకు పంచిన ప్రధాని మోదీ| Asianet News Telugu
Akshaya Tritiya Gold buying: అక్షయ తృతీయ సందర్భంగా బంగారం గ్రాము ఎంతో తెలుసా?| Asianet News Telugu