ఇంటిపనులు చేయడంలేదని.. కోడలిని కాల్చి చంపిన అత్త.. దోపిడీ దొంగల పని అంటూ నాటకం..

Published : Jun 29, 2023, 12:02 PM IST
ఇంటిపనులు చేయడంలేదని.. కోడలిని కాల్చి చంపిన అత్త.. దోపిడీ దొంగల పని అంటూ నాటకం..

సారాంశం

ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాలో ఇంటి పనులు చేయడం లేదని ఓ మహిళ తన కోడలును కాల్చి చంపింది. ఆ తరువాత దోపిడీ దొంగల పని అంటూ నాటకం ఆడింది. 

ఉత్తరప్రదేశ్‌ : ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఇంటి పనిని నిర్లక్ష్యం చేస్తుందనే ఆరోపణతో ఓ మహిళను ఆమె అత్తగారు కాల్చి చంపింది. ఈ ఘటన జరిగినప్పుడు ఇంట్లో కుటుంబ సభ్యులెవరూ లేరు. కోమల్ అనే బాధితురాలు నిద్రిస్తుండగా, ఆమె అత్తగారి తలపై కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు. ఆ తరువాత ఆ మహిళ పిస్టల్‌ను రోడ్డు పక్కన ఉన్న డ్రెయిన్‌లోకి విసిరేసింది. దోపిడీ దొంగలు వారి ఇంటిని దోచుకునేందుకు వచ్చారని, కోడలిని చంపారని నాటకం ఆడింది. 

వరకట్నం, తమ హోదాకు తగ్గట్టుగా లేవు అంటూ కుటుంబంలో తరచూ గొడవలు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో బాధితురాలి అత్త, మామ, ఆమె భర్తను అరెస్టు చేసి జైలుకు పంపారు. వరకట్న మరణాలకు సంబంధించిన భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 304 బి కింద కేసు నమోదు చేయబడింది.

మధ్యప్రదేశ్ లోనూ కర్ణాటక ఫార్ములా.. ఫోన్ పే లోగోపై చౌహాన్ ఫొటో తో కాంగ్రెస్ ప్రచారం..మండిపడ్డ పేమెంట్స్ కంపెనీ

ఇదిలా ఉండగా, గుజరాత్ లో వెలుగు చూసిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జూన్ నెల ప్రారంభంలో వెలుగు చూసిన ఈ వీడియోలో ఓ కోడలు అత్తమీద పడి కరుస్తోంది. ఆస్తి కోసం అత్తను కొట్డడమే కాకుండా.. ఆమె మీద పడి కరిచింది. ఈ వీడియోను బాధితురాలి కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేస్తూ.. పోస్ట్ చేశాడు. 

గుజరాత్, సూరత్‌లో ఈ నెల ప్రారంభంలో ఆస్తి వివాదం విషయంలో ఓ మహిళ తన వృద్ధ అత్తపై దాడి చేసి, కొరికింది. బాధితురాలి కుమారుడు ఈ ఘటనను చిత్రీకరించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ వీడియో కలవరపరిచింది. వీడియో ఆమె ఇద్దరు పిల్లలు సోఫాలో కూర్చుని ఉండడం కనిపిస్తుంది. 

ఆస్తి గొడవ చిలికి చిలికి గాలివానగా మారడంతో కోడలు, అత్తగారి మధ్య తీవ్ర వాగ్వాదం పెరిగి హింసాత్మకంగా మారింది. సంఘటన మొత్తం, బాధితురాలి భర్త కోడలి దాడి నుండి ఆమెను రక్షించడానికి ప్రయత్నిస్తున్నాడు.

నిందితురాలు ఇప్పటికే సూరత్‌లోని ఒక ఆస్తిని తన పేరు మీదికి మార్చుకుందని, ఇప్పుడు గ్రామంలోని మరొక ఆస్తిని కూడా అదే విధంగా చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. ఆమె తన భర్త, అత్తవారిపై వరకట్నం కేసు కూడా పెట్టింది. ఆస్తి కోసం తమ ఇంట్లో ఉన్న అత్తగారిపై శారీరకంగా దాడికి దిగింది. ప్రస్తుతం పోలీసులు ఈ అంశంపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Indigo కు షాక్: 10 శాతం విమానాలు రద్దు.. రంగంలోకి ప్రత్యేక టీమ్ తో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
ఏఐ ఉద్యోగాలను తగ్గించదు.. పెంచుతుంది : యోగి ఆసక్తికర కామెంట్స్