వలస కార్మికుడిని ఢీ కొట్టి.. రోడ్డుమీద ఈడ్చుకెళ్లిన ఆడీ కారు, వ్యక్తి మృతి...

Published : Jun 06, 2023, 11:03 AM ISTUpdated : Jun 06, 2023, 11:15 AM IST
వలస కార్మికుడిని ఢీ కొట్టి.. రోడ్డుమీద ఈడ్చుకెళ్లిన ఆడీ కారు, వ్యక్తి మృతి...

సారాంశం

హర్యానాలో విలాసవంతమైన కారు ఢీకొని, కొన్ని మీటర్ల వరకు ఈడ్చుకెళ్లడంతో ఓ వలసకార్మికుడు మృతి చెందాడు. ఈ ఘటనలో నిందితుడిపై కేసు నమోదయ్యింది. 

హర్యానా : హర్యానాలోని అంబాలాలో దారుణ ఘటన వెలుగు చూసింది. 28 ఏళ్ల వలస కార్మికుడిని ఆడి కారు ఢీకొట్టింది. అలాగే కొన్ని మీటర్ల వరకు ఈడ్చుకెళ్ళింది. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి మృతి చెందాడు. భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ)లోని సంబంధిత సెక్షన్ల కింద గుర్తు తెలియని కారు డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, హర్యానాలోని అంబాలాలో 28 ఏళ్ల వలస కార్మికుడిని ఒక లగ్జరీ కారు ఢీకొట్టడంతో మరణించాడు. అంబాలా-ఢిల్లీ జాతీయ రహదారిపై ఆదివారం అర్థరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితుడు నితీష్ కుమార్, అతని సోదరుడు అంబాలా కంటోన్మెంట్ కు వెళ్లడానికి బండికోసం రోడ్డు పక్కన నిలబడి ఉన్నారని పోలీసులు సోమవారం తెలిపారు.

గుజరాత్ లో దారుణం.. క్రికెట్ బాల్ పట్టుకున్నాడని గొడవ.. దళిత యువకుడి బొటన వేలు నరికిన దుండగులు..

మృతుడు నితీష్ కుమార్ బీహార్‌లోని సమస్తిపూర్‌ నివాసి. హైవేపై ఉన్న ఫ్యాక్టరీలో పని చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. ప్రమాదం తరువాత దీని గురించి నితీష్ సోదరుడు.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అందులో చండీగఢ్ రిజిస్ట్రేషన్ నంబర్‌ను కలిగి ఉన్నట్లు అనుమానిస్తున్న ఆడి కారు షహాబాద్ వైపు నుండి వచ్చిందని.. తన సోదరుడిని ఢీకొట్టిందని కుమార్ ఫిర్యాదులో వెల్లడించాడు.

కారుతో ఢీ కొట్టిన తరువాత.. కారును ఆపకుండా.. కారుమీద చిక్కున్న తన సోదరుడిని డ్రైవర్ కొన్ని మీటర్ల వరకు ఈడ్చుకెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాడని, ఘటన తరువాత డ్రైవర్‌ అక్కడి నుంచి పరారయ్యాడని ఫిర్యాదుదారు తెలిపాడు. ఈ సంఘటన రాత్రి పూట జరిగినందున, గాయపడిన తన సోదరుడిని ఆసుపత్రికి తరలించడానికి కుమార్ సోదరుడు ఎటువంటి వాహనం దొరకలేదని పోలీసులు తెలిపారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కుమార్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అతడు మృతి చెందినట్లు నిర్ధారించినట్లు వారు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి పంపించి.. ఆ తరువాత మృతుడి కుటుంబీకులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. గుర్తుతెలియని కారు డ్రైవర్‌పై ఇండియన్ పీనల్ కోడ్ (ఐపిసి) సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు