యుపి జువెనైల్ హోమ్‌లో ఘోరం : బాలికలను చెప్పుతో కొట్టి, తాడుతో కట్టి చిత్రిహింసలు.. సూపరింటెండెంట్‌పై కేసు...

Published : Sep 14, 2023, 01:16 PM IST
యుపి జువెనైల్ హోమ్‌లో ఘోరం : బాలికలను చెప్పుతో కొట్టి,  తాడుతో కట్టి చిత్రిహింసలు.. సూపరింటెండెంట్‌పై కేసు...

సారాంశం

జువైనల్ హోమ్‌లో బాలికను చెప్పుతో కొట్టిన అమానుష ఘటనకు చెందిన వీడియో వెలుగు చూసింది. ఇప్పుడీ వీడియో వైరల్ కావడంతో హోం సూపరింటెండెంట్‌పై కేసు నమోదు చేశారు.

ఆగ్రా : పిల్లలను సంరక్షించడం, సంస్కరించే పనిలో ఉన్న ఒక ప్రభుత్వ అధికారి కనికరం లేకుండా ప్రవర్తించింది. ఓ బాలికను చెప్పుతో దారుణంగా కొట్టింది. ఆగ్రాలోని జువైనల్ హోమ్ కు చెందిన ఓ షాకింగ్ సిసిటివి ఫుటేజీలో ఇది కనిపించింది. జువైనల్ హోంలో ఉన్న పిల్లల భద్రతపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తే మరో వీడియోలో, ఒక అమ్మాయి చేతులు, కాళ్ళు కట్టివేయబడి ఉంది.

జువైనల్ హోమ్‌లోని ఓ చిన్నారి కొద్దిరోజుల క్రితం ఆత్మహత్యాయత్నం కూడా చేసింది.హోం సూపరింటెండెంట్ పూనమ్ పాల్‌ను సస్పెండ్ చేసి ఆమెపై కేసు నమోదు చేశారు. ప్రయాగ్‌రాజ్‌లోని జువైనల్ హోమ్‌లో కూడా పాల్ ఇలాంటి సంఘటనలకు పాల్పడ్డారు.

నాలుగేళ్ల ఏళ్ల బాలికపై హత్యాచారం.. పొలంలో మృతదేహం కుక్కలు పీక్కుతింటూ....

సోమవారం వెలువడిన మొదటి వీడియోలో..., ఒక గదిలో ఒక మంచం మీద ఒక బాలికను పడుకోబెట్టారు. మరో మంచం మీద మరో ఆరుగురు బాల ఖైదీలు... మూడు మంచాలు ఒకదగ్గర కలిపిన దానిమీద విశ్రాంతి తీసుకోవడం కనిపిస్తుంది. పాల్ గదిలోకి ప్రవేశించి, కనికరం లేకుండా అమ్మాయిని కొట్టడం, ఇతర పిల్లలను తిట్టడం.. మరొక ఉద్యోగి చూస్తూ ఉండగా వారిలో ఒకరిని చెంపదెబ్బ కొట్టడం కనిపిస్తుంది.

మంగళవారం మరింత కలతపెట్టే వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఏడేళ్లకు మించని ఒక అమ్మాయి, చేతులు, కాళ్లు కట్టి మంచం పక్కన పడుకుని ఉంది. లేచి తనను తాను విడిపించుకోవడానికి ఆమె తీవ్రంగా ప్రయత్నించడంతో ఆమె.. పదే పదే మంచం పక్కన జారిపోతుండడం కనిపించింది.

ఆగ్రా డివిజన్ కమీషనర్ రీతూ మహేశ్వరి మాట్లాడుతూ, "ఈ సంఘటనలతో సంబంధం ఉన్న హోమ్ సూపరింటెండెంట్, పూనమ్ పాల్, ఇతర సిబ్బందిని సస్పెండ్ చేశాం. కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా మేజిస్ట్రేట్‌ను ఆదేశించాం. ఎఫ్ఐఆర్ దాఖలు చేశాం"

ఆగ్రా జిల్లా జడ్జి, అదనపు జిల్లా జడ్జి, షెల్టర్ హోమ్ కమిటీ చైర్‌పర్సన్ బుధవారం హోంను పరిశీలించారు. అక్కడ అనేక లోటుపాట్లు ఉండడం గుర్తించారు. బాలనేరస్థులు ఉన్న ఒక గదిలో బీడీలు, పొగాకు నమలడం, ఖైదీలలో ఒకరి వద్ద అనుమతించిన దానికంటే చాలా ఎక్కువ డబ్బు ఉండటం, పిల్లలకు ఇస్తున్న ఆహారం సరిపోవడం లేదని తేలింది.

"పిల్లలను సురక్షితంగా ఉంచడానికి బదులుగా చిత్రహింసలకు గురిచేస్తున్నట్లు వీడియోలు చూపిస్తున్నాయి. మొదటి వీడియో కనిపించిన తర్వాత...జిల్లా మేజిస్ట్రేట్‌ను సంప్రదించి ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేయాలని డిమాండ్ చేసామని" అని బాలల హక్కుల కార్యకర్త నరేష్ పరాస్ అన్నారు.

PREV
click me!

Recommended Stories

MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu