బిహార్‌లో స్కూల్‌కు వెళ్లే పిల్లలను మోసుకెళ్లుతున్న పడవ మునిగిపోయింది. దీంతో 12 మంది గల్లంతయ్యారు. 34 మంది వెళ్లుతున్న ఆ పడవ మునిగిపోవడంతో పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రెస్క్యూ ఆపరేషన్‌లోకి దిగాయి. ఇప్పటి వరకు సుమారు 20 మందిని కాపాడినట్టు సమాచారం.
పాట్నా: బిహార్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. 34 మంది స్కూల్‌కు వెళ్లుతున్న పిల్లలు మోసుకెళ్లుతున్న పడవ మునిగిపోయింది. 12 మంది పిల్లలు గల్లంతయ్యారు. వారి ఆచూకీ కనిపించడం లేదు. నీట మునిగిపోయారా? అనే భయాలు ఉన్నాయి. ఈ ఘటన ఈ రోజు (గురువారం) ఉదయం చోటుచేసుకుంది. బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఈ ఘటన జరిగింది.
స్కూల్‌కు వెళ్లే పిల్లలు బాగమతి నది దాటి వెళ్లాల్సి ఉన్నది. వారు చిన్న పడవలో ఆ నది దాటుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో స్థానికంగా కలకలం రేగింది. పోలీసులకు సమాచారం అందింది. వారు వెంటనే స్పాట్‌కు వచ్చారు. ఎన్డీఆర్ఎఫ్ సహాయ బృందాలకు వారు సమాచారం ఇచ్చారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా వెంటనే స్పాట్‌కు వచ్చి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి.
BIG ACCIDENT IN MUZAFFARPUR BIHAR
The boat carrying children going to school capsized in Muzaffarpur.. About 34 children were on board the boat. Many children were reported missing. Police reached the spot and NDRF is being called. … pic.twitter.com/U4E2rsrPJ8
Also Read: ఫ్లైట్‌లో టాయిలెట్‌లో శృంగారం.. డోర్ ఓపెన్ చేయగానే ప్రయాణికులు షాక్.. వీడియో వైరల్
ఇప్పటి వరకు సుమారు 20 మంది పిల్లలను రక్షించినట్టు జాతీయ మీడియా తెలిపింది.