
హర్యానాలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన స్నేహితురాలితో కలిసి ఓ హోటల్ లో డిన్నర్ చేస్తున్న సమయంలో ఓ దుండగుల గుంపు అక్కడికి చేరుకుంది. ఆ వ్యక్తి చేయి నరికింది. అనంతరం ఆ చేయిని కారులో ఎత్తుకొని వెళ్లిపోయారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది.
త్రిపురలో రక్తపాతం చూసిన రోజులు తిరిగి రానివ్వొద్దు: ఓటర్లతో అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ
పలు మీడియా సంస్థలు, డీఎస్పీ రామ్‌దత్ నైన్ తెలిపిన వివరాల ప్రకారం.. బాధితుడిని కర్నాల్‌లోని రహ్రా గ్రామానికి చెందిన 30 ఏళ్ల జుగ్నుగా గుర్తించారు. అతడు సోమవారం పిప్లికి వచ్చాడు. అక్కడి నుంచి మూడు కిలోమీటర్ల దూరంలోని జీటీ రోడ్డులోని హవేలీలో తన స్నేహితురాలితో కలిసి డిన్నర్ చేస్తున్నాడు. కొంత సమయం తరువాత పది నుండి పన్నెండు మంది వ్యక్తులు ముఖాలను కవర్ చేసుకొని అక్కడికి చేరుకున్నారు.
గెట్ అవుట్ రవి.. తమిళనాడులో గవర్నర్‌కు వ్యతిరేకంగా పోస్టర్లు.. మరింతగా ముదురుతున్న వివాదం..!
జుగ్ను వద్దకు వచ్చి తీవ్రంగా కొట్టారు. అనంతరం అతడి చేయిని దారుణంగా నరికారు. అనంతరం నరికిన చేతిని కారులో ఉంచుకొని అక్కడి నుంచి పరారయ్యారు. పూర్తిగా రక్తంతో తడిసిపోయిన బాధితుడు కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకొని సమీపంలోని హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం చండీగఢ్‌లోని లోక్‌నాయక్ జై ప్రకాష్ నారాయణ్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ఈ ఘటనతో ఆ ప్రాంత వాసులు ఒక్క సారిగా ఉలిక్కిపడ్డారు.
అయితే ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న జుగ్ను పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కురుక్షేత్ర హవేలీలో ఈ ఘటన జరిగింది. దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది. నిందితులను గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని అధికారులు తెలిపారు. బాధితుడి వాగ్మూలం ఆధారంగా సంజు, అంకుష్‌ల పేర్లతో 307, 326 తదితర సెక్షన్‌ల కింద పోలీసులు కేసు నమోదు చేసినట్లు స్టేషన్ సదర్ తానేసర్ మేనేజర్ నిర్మల్ సింగ్ తెలిపారు.