నాలుగో తరగతి విద్యార్థిని పట్ల తోటి విద్యార్థులు దారుణానికి ఒడిగట్టారు. 10 ఏళ్ల లోపు వయస్సు ఉన్న వారంతా ఆ బాలికను జామెట్రీ కంపాస్ తో ఘోరంగా 108 సార్లు పొడిచారు. ఈ ఘటనపై చైల్డ్ వెల్ఫేర్ కమిటీ దర్యాప్తు జరుపుతోంది.
మధ్యప్రదేశ్ లో దారుణం జరిగింది. నాలుగో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని తోటి విద్యార్థులు 108 సార్లు దారుణంగా పొడిచారు. దీని కోసం జామెట్రీ కంపాస్ బాక్స్ ను ఉపయోగించారు. ఈ ఘటన ఇండోర్ సిటీలో కలకలం రేకెత్తించింది. దీనిపై చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యూసీ) స్పందించింది. దీనిపై దర్యాప్తు జరపాలని పోలీసులను ఆదేశించింది.
వాహనాల్లో నుంచి రోడ్లపైకి కరెన్సీ నోట్లు వెదజల్లిన యువకులు.. వీడియో వైరల్..
ఇండియా టుడే కథనం ప్రకారం.. ఇండోర్ సిటీలోని ఏరోడ్రోమ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ప్రైవేట్ స్కూల్ ఉంది. అందులో బాధిత బాలిక నాలుగో తరగతి చదువుతోంది. ఎప్పటిలాగే నవంబర్ 24వ తేదీన స్కూల్ కు వెళ్లింది. తోటి విద్యార్థులతో కలిసి క్లాస్ లో కూర్చుంది. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు గానీ.. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆ బాలికను తోటి విద్యార్థులంతా కలిసి జామెట్రీ కంపాస్ తో 108 సార్లు దారుణంగా పొడిచారు.
ఆ బాలిక ఇంటికి వెళ్లిన తరువాత ఈ విషయాన్ని తన తండ్రికి తెలిపింది. దీంతో తండ్రి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. తోటి విద్యార్థులు ఇంత హింసాత్మకంగా ఎందుకు ప్రవర్తించారో తనకు ఇప్పటికీ తెలియడం లేదని తెలిపారు. క్లాస్ రూమ్ లోని సీసీటీవీ ఫుటేజీని పాఠశాల యాజమాన్యం తనకు అందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తిరుమల ఆలయాన్ని రక్షించండి - ప్రధాని మోడీకి టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు విజ్ఞప్తి
కాగా.. ఈ ఘటనపై సీడబ్ల్యూసీ చైర్ పర్సన్ పల్లవి పోర్వాల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ కేసు దిగ్భ్రాంతికరంగా ఉందని తెలిపారు. ఇంత చిన్న వయసు పిల్లలపై హింసాత్మకంగా ఎందుకు ప్రవర్తించారనేది తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఈ విషయంలో పోలీసుల నుంచి దర్యాప్తు నివేదిక కోరినట్టు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి పిల్లలు, వారి కుటుంబాలకు సీడబ్ల్యూసీ కౌన్సిలింగ్ ఇస్తుందని అన్నారు. పిల్లలు హింసాత్మక దృశ్యాలను కలిగి ఉన్న వీడియో గేమ్స్ ఆడుతున్నారా అనే విషయాన్ని కూడా కనుగొంటామని తెలిపారు.