
తన చెల్లెలిని పొరుగున ఉన్న ఓ యువకుడు వేధిస్తున్నాడని ఆగ్రహించిన అన్న అతడిని కత్తితో పొడిచి చంపాడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో కలకరం రేపింది. నిందితుడైన 20 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు.
అప్పుడూ లేదు.. ఇప్పుడూ లేదు: 'కాంగ్రెస్ జీ23' పై శశిథరూర్ కీలక వ్యాఖ్యలు
చిక్కబళ్లాపూర్ రూరల్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ప్రదీప్ పూజార్ తెలిపిన వివరాల ప్రకారం.. చిక్కబళ్లపూర్ లో ఉండే ఓ 17 ఏళ్ల యువతిని స్థానిక గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేసే 19 ఏళ్ల నందన్ వేధింపులకు గురి చేశాడు. వీరిద్దరు ఇరుగుపొరుగున నివసిస్తారు. అయితే ఈ విషయం యువతి అన్న అయిన దర్శన్ కు తెలిసింది. దీంతో తన చెల్లి నుంచి దూరంగా ఉండాలని దర్శన్ నందన్‌ను హెచ్చరించాడు. అయినా అతడు పట్టించుకోలేదు. పదే పదే ఆమెకు కాల్ చేశాడు. దీంతో ఆమె అతడి నెంబర్ ను బ్లాక్ చేసింది.
By-polls: 6 రాష్ట్రాల్లోని 7 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల
ఇదే సమయంలో నందన్ ఆ యువతి ఫొటోలను వైరల్ చేస్తానని బెదిరింపులకు గురి చేశాడు. దీంతో కోపం తెచ్చుకున్న దర్శన్ అతడిని చంపేయాలని నిర్ణయించుకున్నాడు. నిందితుడు ఓ కత్తిని కొనుగోలు చేసి, దర్శన్ ను కలవడానికి తనతో పాటు ఆశ్రయ్ అనే యువకుడి సాయం తీసుకున్నాడు. అతడు నందన్ కాల్ చేసి, దర్శన్ మాట్లాడాలని పిలుస్తున్నాడని చెప్పాడు. దీంతో తాను ఇప్పుడు కలవబోనని, తన ఆఫీసులోనే కలుస్తానని తేల్చి చెప్పారు.
ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ పేలి 7 ఏళ్ల బాలుడి మృతి.. ఛార్జ్ చేస్తున్న సమయంలో ఘటన
అనంతరం దర్శన్, ఆశ్రయ్ కలిసి గార్మెంట్ ఫ్యాక్టరీ దగ్గరకు వెళ్లారు. బాధితుడిని బయటకు పిలిచారు. అతడు బయటకు రాగానే ముగ్గురు కలిసి బైక్ హరోబండే వైపు వెళ్లారు. దారిలో మద్యం కొనుగోలు చేశారు. హరోబండే కొండల వద్దకు చేరుకున్నారు. ఓ కొండపై కూర్చొని ముగ్గురు మద్యం సేవించారు. ఇదే సమయంలో దర్శన్ తన వెంట తెచ్చుకున్న కత్తితో నందన్ మెడపై 70 సార్లు దారుణంగా పొడిచాడు. దీంతో ఆ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. దర్శన్, ఆశ్రయ్ లను చిక్కబళ్లాపూర్
రూరల్ పోలీసులు అరెస్టు చేశారు.