బెంగాల్‌లో దుర్గామాత మండపంలో మహిషాసురుడిగా మహాత్మా గాంధీ.. రాజకీయ దుమారం

By Mahesh KFirst Published Oct 3, 2022, 2:12 PM IST
Highlights

బెంగాల్‌లో దుర్గామాత మండపం వివాదాన్ని రేకెత్తించింది. దుర్గామాత మహిషాసురుడిని హతమార్చే విగ్రహంలో మహిషాసురుడి స్థానంలో మహత్మా గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇది రాజకీయ దుమారాన్ని రేపింది.
 

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని ఓ దుర్గామాత మండపం వివాదానికి కేంద్రమైంది. ఆల్ ఇండియా హిందూ మహాసభ నిర్వహిస్తున్న ఈ మండపంలో మహిషాసురుడిగా మహాత్మా గాంధీని చిత్రించారు. దుర్గా మాత శూలం కింద మహిషాసురిడికి బదులు మహాత్మాగాంధీని పోలే విగ్రహం పెట్టారు. ఇది వివాదానికి దారితీసింది. రాజకీయ దుమారం రేగింది. కేంద్ర హోం వ్యవహారాల శాఖ ఒత్తిడితో ఆ నిర్వాహకులు ఆ విగ్రహం ఫేస్ మార్చివేశారు. పోలీసులకు ఓ ఫిర్యాదు అందిన తర్వాత వారి సూచనల మేరకు అఖిల్ భారతీయ హిందూ మహాసభా ఆ విగ్రహం అప్పియరెన్స్‌ను మార్చినట్టు  పీటీఐ రిపోర్ట్ చేసింది.

ఆల్ ఇండియా హిందూ మహాసభ పశ్చిమ బెంగాల్ యూనిట్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ చంద్రచూర్ గోస్వామిని ఈ విషయమై ఆరా తీయగా షాకింగ్ కామెంట్లు చేశాడు. గాంధీని తాము నిజమైన అసురుడిగా చూస్తామని అన్నారు. అందుకే విగ్రహం ఇలా రూపొందించామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీని ప్రమోట్ చేస్టు్నదని, తాము ఈ విగ్రహంలో మార్పులు చేయడానికి ఒత్తిడి చేశారని వివరించారు. కేంద్ర హోం శాఖ ఒత్తిడి చేస్తున్నదని అన్నారు. గాంధీ విగ్రహాలను తొలగించి అక్కడే నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఇతర ఫ్రీడమ్ ఫైటర్ల విగ్రహాలు పెట్టాలని తాము భావిస్తున్నారని తెలిపారు.

ఈ విగ్రహంపై రాజకీయ దుమారం రేగింది. రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్షాలు అన్నీ ఈ ఘటనపై అభ్యంతరం తెలిపాయి. నిర్వాహకులపై సీరియస్ అయ్యాయి. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, మొదలు విపక్షంలోని బీజేపీ, సీపీఎం, కాంగ్రెస్ పార్టీ వరకు మహాత్ముడికి జరిగిన అవమానంపై నోరెత్తాయి.

ఇది నిజమే అయితే.. అవమానానికి ఏమాత్రం తక్కువ కాదని టీఎంసీ రాష్ట్ర ప్రతినిధి కునాల్ ఘోష్ అన్నారు. జాతిపితకు ఇది అవమానమే.. ప్రతి భారతీయుడికి అవమానం అని పేర్కొన్నారు. ఈ అవమానం గురించి బీజేపీ ఏమంటుంది? గాంధీ హంతకుడి భావజాల శిబిరం ఏదో మనకు తెలిసిందే అని విమర్శలు సంధించారు. 

కాగా, రాష్ట్ర బీజేపీ నేతలు కూడా ఈ ఘటనను తప్పుబట్టారు. ఇలా చేసి ఉంటే.. అది చాలా దురదృష్టకరం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్ అన్నారు. తాము దీన్ని ఖండిస్తున్నామని తెలిపారు.

click me!