దారుణం.. పెంపుడు కుక్కను ‘కుక్క’ అని పిలిచినందుకు వ్యక్తి హత్య.. తమిళనాడులో ఘటన

By team teluguFirst Published Jan 21, 2023, 1:51 PM IST
Highlights

తమిళనాడు రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ పెంపుడు కుక్కను ‘కుక్క’ అని పిలిచినందుకు ఓ వ్యక్తిని అతడి బంధువే హత్య చేశాడు. ఈ ఘటనలో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.  

పెంపుడు కుక్కను ‘కుక్క’ అని పిలిచినందుకు ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేకెత్తించింది. వివరాలు ఇలా ఉన్నాయి. దిండిగల్ జిల్లాలోని తాడికొంబు పోలీస్‌ పరిధిలోని ఉలగంపట్టియార్‌కోట్టం పరిధిలోని ఓ ఇంట్లో నిర్మలా ఫాతిమా రాణి, ఆమె కుమారులు డేనియల్, విన్సెంట్ లు నివసిస్తున్నారు.

చైనాకు వార్నింగ్.. ఎల్ఏసీ ఉద్రిక్తతల మ‌ధ్య ఈశాన్యంలో భారత వైమానిక దళం యుద్ధ విన్యాసాలు

ఆ ఇంటికి సమీపంలో వారి బంధువు రాయప్పన్‌ (62) కూడా నివసిస్తున్నాడు. అయితే ఫాతిమా కుటుంబం ఓ కుక్కను పెంచుకుంటోంది. పలు మార్లు రాయప్పన్ దానిని కుక్క అని పిలిచాడు. దీంతో అలా పిలవకూడదని కుటుంబ సభ్యులు కోరారు. పలు మార్లు ఆయనను హెచ్చరించారు. అయితే ఈ క్రమంలో గురువారం సమీపంలోని తమ పొలంలో నడుస్తున్న నీటి పంపును స్విచ్ ఆఫ్ చేయాలని రాయప్పన్ తన మనవడు కెల్విన్‌ను ఫోన్ లో కోరాడు. ఆ స్విచ్ఛ్ బోర్డు పక్కన కుక్క ఉంటుందని, కాబట్టి ఆత్మరక్షణ కోసం ఓ కర్రను తీసుకెళ్లాలని కోరాడు.

బెంగళూరులో మళ్లీ కుంగిన రోడ్డు... నెలలో మూడో సారి..!

అయితే ఈ తాత, మనవళ్ల మధ్య జరిగిన సంభాషణను ఫాతిమా రాణి కుమారుడు డేనియల్ విన్నాడు. దీంతో మళ్లీ తమ పెంపుడు కుక్కను ‘కుక్క’ అని పిలిచాడని అతడికి కోపం వచ్చింది. వెంటనే డేనియర్ రాయప్పన్ దగ్గరకు వెళ్లి గొడవ పెట్టుకున్నాడు. ఈ గొడవ తీవ్ర వాగ్వాదంగా మారింది. ఆగ్రహంతో డేనియల్ అతడి ఛాతీపై గట్టిగా కొట్టాడు. దీంతో రాయప్పన్ ఒక్క సారిగా నేలపై అక్కడికక్కడే మృతి చెందాడు.

డోలో 650 టాబ్లెట్ల తయారీదారుపై హైకోర్టులో పిటిషన్.. ఆ స్కామ్ విచారణ ఫిబ్రవరి 20కి వాయిదా

ఈ ఘటనపై ఆందోళన చెందిన డేనియల్, అతడి కుటుంబం అక్కడి నుంచి భయంతో పారిపోయారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే శుక్రవారం రోజు నిర్మల, ఆమె ఇద్దరు కుమారులను పట్టుకున్నారు. వారిపై  భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ)లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

click me!