బెంగళూరులో మళ్లీ కుంగిన రోడ్డు... నెలలో మూడో సారి..!

Published : Jan 21, 2023, 01:11 PM IST
బెంగళూరులో మళ్లీ కుంగిన రోడ్డు... నెలలో మూడో సారి..!

సారాంశం

మంగళవారం ఈ మార్గంలో ఓ లారీ ప్రయాణిస్తుండగా రోడ్డు ఒక్కసారిగా కుంగిపోయి గుంత ఏర్పడింది. తాజాగా.. ఇప్పుడు మరో గుంత పడినట్లు అధికారులు గుర్తించారు.

బెంగళూరులో రోడ్డు మరోసారి కుంగింది. ఈ నెలలో ఇది మూడోసారి కావడం గమనార్హం.  ఇటీవల బెంగళూరులోని బ్రిగేడ్‌ రోడ్డులో భారీ గొయ్యి ఏర్పడిన ఘటన మరువకముందే కొద్ది రోజులకే అలాంటి సంఘటనలు మరో రెండు చోటుచేసుకున్నాయి. 

బెంగళూరులోని మహాలక్ష్మి లేఅవుట్‌ రోడ్డు మార్గంలో మంగళవారం ఓ గుంత ఏర్పడింది. కొద్ది రోజుల కిందట ఇక్కడ పైప్‌లైన్‌ పనులు చేపట్టారు. అనంతరం తూతూమంత్రంగా రోడ్డువేసి చేతులు దులుపుకొన్నారు. అయితే మంగళవారం ఈ మార్గంలో ఓ లారీ ప్రయాణిస్తుండగా రోడ్డు ఒక్కసారిగా కుంగిపోయి గుంత ఏర్పడింది. తాజాగా.. ఇప్పుడు మరో గుంత పడినట్లు అధికారులు గుర్తించారు.

మూడోసారి పడిన గుంత...  బెంగళూరు నీటి సరఫరా, మురుగునీటి బోర్డు (BWSSB) చాంబర్‌కు సమీపంలో ఉంది.

సమాచారం అందుకున్న బిడబ్ల్యుఎస్‌ఎస్‌బి, బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బిబిఎంపి) సిబ్బందితో సహా పౌరసరఫరాల అధికారులు సంఘటనా స్థలాన్ని సందర్శించి మరమ్మతు పనులను ప్రారంభించారు.

PREV
click me!

Recommended Stories

Census 2027 : వచ్చేస్తున్న డిజిటల్ జనాభా లెక్కలు.. పేపర్ లేదు, పెన్ను లేదు.. అంతా యాప్ ద్వారానే !
IndiGo : ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ క్షమాపణలు.. బిగ్ అప్డేట్ !