గవర్నమెంట్ స్కూల్ హెచ్ఎం ఓ బాలికపై యాసిడ్ పోసిన ఘటన కర్ణాటకలో వెలుగులోకి వచ్చింది. దీంతో ఆ హెచ్ఎంను విద్యాశాఖ అధికారులు సస్పెండ్ చేశారు. అయితే తాను కావాలని అలా చేయలేదని, అనుకోకుండా జరిగిందని హెచ్ఎం తెలిపారు.
కర్ణాటకలో దారుణం వెలుగులోకి వచ్చింది. టాయిలెట్ ను క్లీన్ చేసేందుకు ఉపయోగించే యాసిడ్ ను ఓ గవర్నమెంట్ స్కూల్ హెడ్ మాస్టర్ ఎనిమిదేళ్ల విద్యార్థినిపై పోశాడు. దీంతో బాలికకు గాయాలు అయ్యాయి. ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆ హెచ్ఎంను సస్పెండ్ చేశారు.
ఆర్‌ఎస్‌ఎస్ నేతల ఫొటోలు ఉంచుకోవడం ఉగ్రవాద చర్య కాదు.. - మద్రాస్ హైకోర్టు
వివరాలు ఇలా ఉన్నాయి. చిత్రదుర్గ జిల్లా జోడిచికెనహళ్లిలోని గవర్నమెంట్ హై స్కూల్ లో రంగస్వామి హెడ్ మాస్టర్ గా పని చేస్తున్నారు. దసరా పండగ నేపథ్యంలో ఇటీవల ఆ స్కూల్ కు సెలవులు ఇచ్చారు. సెలవులు ముగియడంతో స్కూల్స్ తిరిగి బుధవారం తెరుచుకున్నాయి. అయితే స్కూల్ లోని టాయిలెట్లు అన్నీ అపరిశుభ్రంగా ఉండటంతో పలువురు సీనియర్ విద్యార్థులకు వాటిని క్లీన్ చేసే బాధ్యతను హెచ్ఎం రంగస్వామి అప్పగించారు.
అదే సమయంలో ఆ స్కూల్ రెండో తరగతి చదువుతున్న ఎనిమిదేళ్ల సించన టాయిలెట్ దగ్గరకు వచ్చింది. ప్రస్తుతం సీనియర్ విద్యార్థులు టాయిలెట్ ను క్లీన్ చేస్తున్నారనీ, కాబట్టి తిరిగి వెళ్లాలని సించనకు రంగస్వామి సూచించారు. కానీ ఆ బాలిక వినకుండా లోపకలి వెళ్లింది. దీంతో హెడ్ మాస్టర్ కు ఆగ్రహంతో టాయిలెట్ క్లీన్ చేసేందుకు ఉపయోగించే యాసిడ్ ను బాలికపై పోశాడు.
వీధి ఆడ కుక్కపై అరాచకం.. అత్యాచారం చేసి, మూడో అంతస్తు నుంచి విసిరేసిన కామాంధుడు..
దీంతో బాధితురాలు వీపునకు గాయాలు అయ్యాయి. వెంటనే ఆయన తేరుకొని బాధితురాలిని హాస్పిటల్ కు తరలించాడు. బాలిక తల్లిదండ్రులు ఈ విషయంలో పోలీసులను ఆశ్రయించారు. హెచ్ఎంపై చర్యలు తీసుకోవాలని చిత్రదుర్గ రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఎడ్యుకేషన్ (డీడీపీఐ) రవిశంకర్ రెడ్డి స్పందించారు. హెచ్ఎంను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
పశ్చిమ బెంగాల్ మంత్రి జ్యోతిప్రియ మల్లిక్ ను అరెస్టు చేసిన ఈడీ.. ఎందుకంటే ?
కాగా దీనిపై హెచ్ఎం రంగస్వామి స్పందిస్తూ.. తాను కావాలని బాలికపై ఈ చర్యకు పాల్పడలేదని చెప్పారు. సీనియర్ విద్యార్థులు టాయిలెట్ క్లీన్ చేస్తున్న సమయంలో సించన అక్కడికి వచ్చిందని, ఆమెను తిరిగి వెళ్లాలని కోరానని తెలిపారు. అయితే తన జేబులో ఉన్న పౌడర్ ప్రమాదవశాత్తు బాలికపై పడిందని పేర్కొన్నారు. ఉద్దేశపూర్వకంగా ఈ చర్య జరగలేదని నిందితుడు చెప్పారు.