దారుణం.. ప్రధాని మోడీని, సీఎం యోగిని ప్రశంసించాడని కారుతో గుద్ది చంపిన డ్రైవర్

Published : Jun 13, 2023, 04:22 PM IST
దారుణం.. ప్రధాని మోడీని, సీఎం యోగిని ప్రశంసించాడని కారుతో గుద్ది చంపిన డ్రైవర్

సారాంశం

ఉత్తరప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. ప్రధాని మోడీని, సీఎం యోగిని పొగిడాడని ఓ క్యాబ్ డ్రైవర్ ఓ వ్యక్తిని కారుతో గుద్ది చంపాడు. మీర్జాపూర్ లో జరిగిన ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యాబ్ డ్రైవర్ ను పోలీసులు అరెస్టు చేశారు. 

ప్రధాని నరేంద్ర మోడీని, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను ప్రశంసించినందుకు ఓ క్యాబ్ డ్రైవర్ ఓ వ్యక్తిపై కారెక్కించాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. ఈ దారుణానికి పాల్పడిన డ్రైవర్ ను పోలీసులు వెండించి పట్టుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

జమ్మూకాశ్మీర్ లో భద్రతా దళాల భారీ విజయం.. కుప్వారాలోని ఎల్ వోసీ వద్ద ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టిన సైనికులు

వార్తా సంస్థ ‘ఏఎన్ఐ’ ప్రకారం..  మీర్జాపూర్‌లోని వింధ్యాచల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసముంటున్న అమ్జాద్‌ క్యాబ్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. అయితే సోమవారం మీర్జాపూర్ లో ప్రాంతంలో ఓ వివాహం జరిగింది. దీనికి రాజేశ్ ధర్ దూబే (50) అనే వ్యక్తి హాజరయ్యాడు. అనంతరం అక్కడికి అతిథులను తీసుకెళ్లేందుకు అమ్లాద్ తన కారును తీసుకొని వచ్చాడు. అందులో దూబేతో పాటు పలువురు అతిథులు ఎక్కారు. ఈ క్రమంలో దుబేకు, క్యాబ్ డ్రైవర్ మధ్య రాజకీయ చర్చ ప్రారంభమైంది

రాజకీయ చర్చలో భాగంగా దుబే ప్రధాని నరేంద్ర మోడీని, యూపీ సీఎం యోగి అదిత్యనాథ్ ను ప్రశంసించాడు. ఇది ఇది డ్రైవర్‌ను చికాకు పెట్టిందని  మీర్జాపూర్ పోలీసు సూపరింటెండెంట్ సంతోష్ కుమార్ మిశ్రా తెలిపారు. దీంతో డ్రైవర్, దుబేకు మధ్య వాగ్వాదం మొదలైంది. కొంత సమయం తరువాత కారులో ఉన్న ప్రయాణీకులు వారి గమ్యస్థానాలకు చేరుకోవడంతో వాహనాన్ని ఒక్కొక్కరుగా విడిచిపెట్టడం ప్రారంభించారు. అయితే అందులో డ్రైవర్ తో పాటు రాజేష్ దుబే ఒక్కడే మిగిలాడు.

వాషింగ్టన్ - న్యూయార్క్ కు ట్రక్ రైడ్ ను ఆస్వాదించిన రాహుల్ గాంధీ.. భారతీయ ట్రక్ డ్రైవర్ తో సుధీర్ఘ సంభాషణ

కొంత దూరం ప్రయాణించిన తరువాత అమ్జాద్ మార్గమధ్యలో కారును ఆపాడు. కారులో నుంచి దిగాలని దుబేను డ్రైవర్ కోరాడు. దీంతో అతడు కాలినడకన తన ఇంటి వైపు వెళ్లడం మొదలుపెట్టాడు. దీంతో అమ్జాద్ వేగంగా వెనక నుంచి కారుతో అతడిని ఢీకొట్టాడు. దీంతో బాధితుడు తీవ్ర గాయాలతో చనిపోయాడు. అనంతరం డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. సమాచారం అందడంతో వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆరు గంటల పాటు డ్రైవర్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి నిందితుడిని పట్టుకున్నారు. సీసీటీవీ ఫుటేజీ, ఇతర ప్రయాణికుల వాంగ్మూలాల ఆధారంగా నిందితుడిపై కేసు నమోదు చేశారు.ౌ

వార్నీ.. తప్పతాగి రైల్వే ట్రాక్ పై పడుకున్న యువకుడు.. రైలు దిగి నిద్రలో నుంచి లేపిన లోకో పైలట్

ఈ విషయంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మిర్జాపూర్ -ప్రయాగ్‌రాజ్ రహదారిపై వారు నిరసన తెలిపారు. దీంతో ఎస్పీ, జిల్లా అధికారి, సర్కిల్‌ అధికారి సంఘటనా స్థలానికి చేరుకుని ప్రజలను శాంతింపజేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం