అతిక్ అహ్మద్‌కు ప్రత్యేక జైలు బ్యారక్.. పప్పు, చపాతి, కర్రీతో డిన్నర్.. ప్రయాగ్‌రాజ్ జైలులో రాత్రి ఇలా..!

By Mahesh KFirst Published Mar 28, 2023, 6:02 PM IST
Highlights

అతిక్ అహ్మద్‌కు ప్రాణ హాని ఉన్నదని ఆయన, ఆయన సోదరి పలుమార్లు పేర్కొన్న తరుణంలో గుజరాత్‌ నుంచి యూపీకి అతని తరలింపు అధికారులకు కత్తిమీద సాముగా మారింది. కట్టుదిట్టమైన భద్రత నడుమ ఆయనను తరలించారు. సోమవారం రాత్రి యూపీ జైలులో ప్రత్యేక బ్యారక్‌లో ఉంచారు. ఆ బ్యారక్‌లో ప్రత్యేకంగా సీసీటీవీ కెమెరా ఏర్పాటు చేశారు.
 

న్యూఢిల్లీ: 2006 ఉమేశ్ పాల్ కిడ్నాపింగ్ కేసులో గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్, మరో ఇద్దరు నిందితులను స్థానిక కోర్టు దోషులుగా తేల్చింది. జీవిత ఖైదు శిక్ష విధించింది. అతిక్ అహ్మద్‌ను గుజరాత్‌లోని జైలు నుంచి కట్టుదిట్టమైన భద్రత నడుమ యూపీ కోర్టుకు తీసుకువచ్చారు.

అతిక్‌ గ్యాంగ్‌స్టర్ సోదరుడు ఖాలిద్ అజీమ్ అలియాస్ అష్రఫ్‌ను బరేలీ జైలు నుంచి తీసుకువచ్చారు. మరో నిందితుడు ఫర్హన్‌తోపాటు పై ఇద్దరిని సోమవారం రాత్రి జైలులో ప్రత్యేక బ్యారక్‌లో ఉంచారు. అతిక్ అహ్మద్‌కు ప్రాణ హాని ఉన్నదని ఆయన, ఆయన సోదరి పలుమార్లు చేసిన తరుణంలో ఆయనకు భద్రత విషయంలో అధికారులు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. సోమవారం రాత్రంతా వారికి భద్రత కల్పించడంలో జైలు అధికారులు నిమగ్నమయ్యారు.

ఆ ముగ్గురిని తొలుత మెడికల్ చెకప్‌కు తీసుకెళ్లామని, ఆ తర్వాత ప్రత్యేక బ్యారక్‌కు వారిని తీసుకెళ్లామని సీనియర్ జైలు సూపరింటెండెంట్ శశికాంత్ సింగ్ తెలిపారు.

Also Read: ఆన్‌లైన్ షాపింగ్ చేస్తూ రూ. 8.30 లక్షలు పోగొట్టుకున్న మహిళ.. ఎలా జరిగిందంటే?

అతిక్ అహ్మద్ సెల్‌లో ప్రత్యేకంగా ఒక సీసీటీవీ కెమెరా ఏర్పాటు చేశామని వివరించారు. ఆ సీసీటీవీ కెమెరాను జైలు హెడ్‌క్వార్టర్స్‌ కంట్రోల్ చేసింది. ఆ ముగ్గురికీ జైలు మ్యానువల్ ప్రకారం మీల్స్ సర్వ్ చేశామని వివరించారు. వారికి పప్పు, చపాతి, రోటీ, కూరగాయల కర్రీ, రైస్ పెట్టినట్టు తెలిపారు.

మంగళవారం మధ్యాహ్నం అతిక్‌ను ప్రయాగ్ రాజ్ కోర్టులో హాజరుపరిచారు.

click me!