మరింత క్షీణించిన వాజ్‌పేయ్ ఆరోగ్యం: ఎయిమ్స్‌‌కు క్యూ కట్టిన ప్రముఖులు

By narsimha lodeFirst Published Aug 16, 2018, 11:13 AM IST
Highlights

మాజీ ప్రధానమంత్రి వాజ్‌పేయ్ ఆరోగ్యం మరింత క్షీణించింది. మాజీ కేంద్ర మంత్రి,బీజేపీ సీనియర్ నేత  అద్వానీ ఎయిమ్స్ లో వాజ్‌పేయ్‌ను పరామర్శించారు.


న్యూఢిల్లీ: మాజీ ప్రధానమంత్రి వాజ్‌పేయ్ ఆరోగ్యం మరింత క్షీణించింది. మాజీ కేంద్ర మంత్రి,బీజేపీ సీనియర్ నేత  అద్వానీ ఎయిమ్స్ లో వాజ్‌పేయ్‌ను పరామర్శించారు.  మరికొద్దిసేపట్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ మరోసారి ఎయిమ్స్‌కు రానున్నారు. వాజ్‌పేయ్ ఆరోగ్య పరిస్థితి  గురించి డాక్టర్లను వాకబు చేయనున్నారు.

ఎయిమ్స్ వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా  ఎయిమ్స్ లోనే ఉన్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి  జేపీ నడ్డా  ఎయిమ్స్ లోనే ఉన్నారు.  బీజేపీ నేతలు దేశవ్యాప్తంగా తమ కార్యక్రమాలను రద్దు చేసుకొన్నారు.

 

EAM Sushma Swaraj and Agriculture Minister Radha Mohan Singh arrive at All India Institute of Medical Sciences where former Prime Minister Atal Bihari Vajpayee is admitted. Vajpayee is on life support system. pic.twitter.com/5tyeZYuR5k

— ANI (@ANI)

 

Former Prime Minister Atal Bihari Vajpayee's condition continues to remain the same. He is critical and on life support systems: AIIMS statement pic.twitter.com/OJKHHcTDSn

— ANI (@ANI)

 

బీజేపీ కీలక నేతలు ఎయిమ్స్ కు చేరుకొంటున్నారు.  కొద్దిసేపట్లో  ప్రధానమంత్రి  నరేంద్ర మోడీ  ఎయిమ్స్‌కు చేరుకోనున్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు  ఎయిమ్స్‌కు చేరుకొని  వాజ్‌పేయ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొన్నారు. 

 

Senior BJP leader LK Advani and daughter Pratibha Advani arrive at All India Institute of Medical Sciences where former Prime Minister Atal Bihari Vajpayee is admitted. Vajpayee’s condition is critical & he is on life support system pic.twitter.com/QgeG9isWDg

— ANI (@ANI)

 

వాజ్‌పేయ్ బంధువులు హుటాహుటిన గ్వాలియర్  నుండి ఢిల్లీకి బయలుదేరారు. గ్వాలియర్‌లోని ఆయూష్ కాలేజీ విద్యార్థులు వాజ్‌పేయ్ ఆరోగ్యం మెరుగుపడాలని హోమం నిర్వహించారు.

 

: Union Home Minister Rajnath Singh arrives at All India Institute of Medical Sciences where former Prime Minister Atal Bihari Vajpayee is admitted. Vajpayee’s condition is critical & he is on life support system pic.twitter.com/X4YOLvwInm

— ANI (@ANI)

 

గురువారం నాడు ఉదయం  పూట ఎయిమ్స్ వైద్యులు వాజ్‌పేయ్ ఆరోగ్యంపై హెల్త్‌బులెటిన్ విడుదల చేశారు. వాజ్‌పేయ్ ఆరోగ్యం విషమంగానే ఉందని వైద్యులు ప్రకటించారు. 

 

I have been praying to god that just once I can see him give a speech again. Our family can never ever erase that image of his from our minds. I hope he gets well soon: Kanti Mishra, Niece of pic.twitter.com/vxhz7ur1fZ

— ANI (@ANI)

 

click me!