Assembly Elections : ప్రారంభమైన రెండో దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్, రికార్డు స్థాయిలో ఓట్లు వేయాలని మోడీ పిలుపు

Published : Feb 14, 2022, 08:17 AM IST
Assembly Elections : ప్రారంభమైన రెండో దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్, రికార్డు స్థాయిలో ఓట్లు వేయాలని మోడీ పిలుపు

సారాంశం

పలు రాష్ట్రాల్లో రెండో దశ అసెంబ్లీ ఎన్నికలు నేడు ప్రారంభమయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లోని 55 నియోజకవర్గాలతో పాటు గోవా, ఉత్తరాఖండ్‌లోని అన్ని అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ప్రారంభమయ్యింది. 

రెండో దశ అసెంబ్లీ ఎన్నికలలో Uttarpradesh లోని 55 నియోజకవర్గాలతో పాటు గోవా, ఉత్తరాఖండ్‌లోని అన్ని అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 14, సోమవారం ఓటింగ్ ప్రారంభమయ్యింది. ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభం అయ్యింది. goa, Uttarakhandలలో ముఖ్యమంత్రులు ప్రమోద్ సావంత్, పుష్కర్ సింగ్ ధామి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో పోటీలో ఉన్న అభ్యర్థుల్లో జైలులో ఉన్న సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు ఆజం ఖాన్, ఆయన కుమారుడు అబ్దుల్లా ఆజంలు ప్రముఖంగా ఉన్నారు. 

కాగా, ఈ ఎన్నికల మీద యూపీ ముఖ్యమంత్రి Yogi Adityanathమాట్లాడుతూ.. ఇది 80 వర్సెస్ 20 ఎన్నికలని, యూపీలో బీజేపీ 300 సీట్లు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ప్రతిపక్షాల 'thoko raaj' ఆరోపణపై యూపీ ముఖ్యమంత్రి స్పందిస్తూ, “ప్రజా భద్రతకు ముప్పు కలిగించే ప్రతి వ్యక్తి చట్టానికి భయపడాలి. 2017కి ముందు, ప్రతి 3-4 రోజులకు అల్లర్లు జరిగాయి, నెలల తరబడి కర్ఫ్యూ అమలులో ఉంది. దీనికి విరుద్ధంగా, గత 5 సంవత్సరాలలో ఎటువంటి అల్లర్లు, కర్ఫ్యూ జరగలేదు అన్నారు.

'80 vs 20 రిమార్క్' గురించి యోగి ఆధిత్యానాథ్ మరింత వివరిస్తూ...  "ఇది చర్యకు ప్రతిస్పందన. 80 శాతం మంది బీజేపీతో ఉన్నారని, 20 శాతం మంది ఎప్పుడూ మమ్మల్ని వ్యతిరేకిస్తున్నారని, ఈసారి కూడా అలాగే చేస్తారని చెప్పాను. నేను మతం లేదా కులం ప్రాతిపదికన చెప్పలేదు. 80 శాతం మంది భద్రత, అభివృద్ధికి సంబంధించిన ప్రభుత్వ ఎజెండాతో సంతోషంగా ఉన్నవారు ఉన్నారు... అంటూ చెప్పుకొచ్చారు.

“20 శాతం మందిలో ప్రతికూల మనస్తత్వం ఉన్నవారు ఉంటారు, వారు ఎల్లప్పుడూ వ్యతిరేకిస్తారు. మాఫియాలు, నేరస్థులకు మద్దతు ఇస్తారు. మొదటి దశ ఎన్నికల తర్వాత, ఈ ఎన్నికలు నిజంగా 80 వర్సెస్ 20 అని స్పష్టమైంది. బిజెపికి 80 శాతానికి పైగా ప్రజల నుండి మద్దతు లభించింది, ”అని యుపి సిఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు.

ఇదిలా ఉంటే గోవాలో పోలింగ్ ప్రారంభం కాగానే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్విటర్ వేదికగా ఓటర్లను ‘ఈ అవినీతి వ్యవస్థను మార్చి గోవాను అవినీతి రహితంగా మార్చే శక్తి మీకు ఉంది. దయచేసి ఈరోజు మీ పిల్లల భవిష్యత్తు కోసం బయటకు వచ్చి ఓటు వేయండి’ అంటూ అభ్యర్థించారు.

ఇక గోవాలో పోలింగ్ ప్రారంభం కాగానే గవర్నర్ పీఎస్ శ్రీధరన్ పిళ్లై, ఆయన భార్య రీతా శ్రీధరన్ తలైగావ్ అసెంబ్లీ నియోజకవర్గంలోని పోలింగ్ బూత్ నంబర్ 15లో ఓటు వేసి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

రెండో దశ పోలింగ్ ప్రారంభం కాగానే ఈ పోలింగ్ లో రికార్డు స్థాయిలో ఓటర్లు హాజరు కావాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ‘ఉత్తరాఖండ్, గోవా, ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో సోమవారం పోలింగ్ జరగనుంది. ఈరోజు ఓటు వేయడానికి అర్హులైన వారందరూ రికార్డు సంఖ్యలో ఓటు వేసి ప్రజాస్వామ్య పండుగను బలోపేతం చేయాలని నేను పిలుపునిస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశారు. 

PREV
click me!

Recommended Stories

India Gate Ahead of Republic Day 2026: త్రివర్ణ దీపాల కాంతులతో ఇండియా గేట్ | Asianet Telugu
Fresh Snowfall in Sonamarg: మోదీ ప్రారంభించిన సోనమార్గ్ఇప్పుడు ఎలా ఉందో చూడండి| Asianet News Telugu